
ముఖ్యంగా సంక్రాంతి వస్తున్నాం సినిమా విడుదల అయిన తర్వాత ఏకంగా 25 సినిమా కథలను విన్నారట వెంకటేష్.. అయితే ఇందులో ఒక్కటి కూడా తాను ఓకే చెప్పలేదని ఏమాత్రం కొద్దిగా బాగోలేక పోయినా కూడా ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే సినిమా అని రిజెక్ట్ చేసినట్టుగా టాక్ వినిపిస్తోంది. గతంలో F2,F3 చిత్రాల తర్వాత డైరెక్టర్ శైలేష్ కొలనుతో సైంధవ్ అనే చిత్రంలో నటించగా అది డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తన సక్సెస్ ని కంటిన్యూ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట వెంకటేష్.
యంగ్ డైరెక్టర్స్ నుంచి, కొత్త డైరెక్టర్లు, సీనియర్ డైరెక్టర్లు స్టోరీలు చెప్పినా కూడా కథ నచ్చకపోతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఆలస్యమైన సరే కచ్చితంగా హిట్ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రావాలని డిసైడ్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వెంకటేష్ అభిమానులు 300 కోట్ల క్లబ్ లోకి చేరిన తర్వాత సినిమా రావాలి అంటే ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోక తప్పదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మరి వెంకటేష్ ఇలా 25 సినిమా కథలను రిజెక్ట్ చేస్తే మరి రాబోయే సినిమాలో ఏ విధంగా కనిపిస్తారో చూడాలని ఫ్యాన్స్ చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు.