
ఈ నెల 7వ తేదీ నుంచి లైలా మూవీ ఓటీటీలో అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీతో పాటు ఆహా ఓటీటీలో సైతం అందుబాటులోకి వస్తుండటం గమనార్హం. ఈ విధంగా రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ కావడం వల్ల నిర్మాతలకు రిస్క్ తగ్గడంతో పాటు ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు ఈ సినిమాను ఓటీటీలో చూసే అవకాశం అయితే ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు.
ధనరాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రామం రాఘవం సినిమా సైతం ఈటీవీ విన్ యాప్ తో పాటు సన్ నెక్స్ట్ యాప్ లో అందుబాటులోకి రానుంది. ఈ విధంగా అందుబాటులోకి రావడం వల్ల ఈ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం అయితే ఉంది. రామం రాఘవం మూవీకి ఓటీటీలలో మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 14వ తేదీన రామం రాఘవం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
గతంలో ఆర్.ఆర్.ఆర్ మూవీ సైతం ఒకటి కంటే ఎక్కువ ఓటీటీలలో అందుబాటులోకి వచ్చింది. కరోనా సమయంలో విడుదలైనప్పటికీ ఆర్.ఆర్.ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి ప్రేక్షకులను మెప్పించిందనే సంగతి తెలిసిందే. రాజమౌళి ప్రస్తుతం మహేష్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. మహేష్ జక్కన్నలకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. హిట్ సినిమాలు ఎక్కువ సంఖ్యలో ఓటీటీలలో స్ట్రీమింగ్ అయినా ఇబ్బంది లేదు కానీ ఫ్లాప్ సినిమాలు ఎక్కువ ఓటీటీలలో స్ట్రీమింగ్ కావడం వల్ల పెద్దగా ప్రయోజనం అయితే ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.