సూపర్ స్టార్ నాగార్జున తన సినీ కెరీర్ లో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. నాగార్జున పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. భర్త కోసం సూపర్ మూవీ హీరోయిన్ ఆవేదన చెందుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. సూపర్ హీరోయిన్లలో ఒకరైన అయేషా టకియా తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు.
 
అయేషా భర్త ఫర్హాన్ అజ్మీ కారు డ్రైవింగ్ వివాదం అంతకంతకూ ముదురుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. తన భర్తను అన్యాయంగా కేసులో ఇరికించారని ఆమె చెబుతున్నారు. ఆ గొడవకు సంబంధించిన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయని అయేషా టకియా పేర్కొన్నారు. తనకు న్యాయం జరగాలని ఇన్ స్టాగ్రామ్ వేదికగా అయేషా టకియా చేసిన పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి.
 
ఒక సూపర్ మార్కెట్ టర్నింగ్ దగ్గర అయేషా టకియా భర్త సిగ్నల్ ఇవ్వకుండానే కారును నడపడం చర్చనీయాంశమైంది. ఆ సమయంలో స్థానికులతో గొడవ జరగగా ఫర్హాన్ తుపాకీ తీసుకున్నాడని సమాచారం అందుతోంది. మహారాష్ట్ర నుంచి వచ్చినందుకు అక్కడివాళ్లు తమను టార్గెట్ చేశారని అయేషా టకియా కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
 
స్థానికులు తన భర్త, కొడుకుపై దాడి చేసి బెదిరించారని ఆమె చెప్పుకొచ్చారు. నా భర్త పోలీస్ హెల్ప్ కోసం 100కు డయల్ చేయగా నా భర్తపైనే తప్పుడు కేసు నమోదు చేశారని అయేషా టకియా వెల్లడించారు. అయేషా టకియా కుటుంబ సభ్యులు వివాదంలో చిక్కుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. సూపర్ హీరోయిన్ కు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. తెలుగులో అయేష టకియా ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం లేదనే సంగతి తెలిసిందే. అయేషా బాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.






మరింత సమాచారం తెలుసుకోండి: