- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


ఆయన టాలీవుడ్ లో ఒక సీనియర్ హీరో గత కొన్నేళ్లుగా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. సినిమాల కు కాస్త గ్యాప్ ఇచ్చిన‌ ఆయన చేస్తున్న సినిమాలు సరిగా సక్సెస్ కావడం లేదు. ఒక సినిమా హిట్ అయిన ఏకంగా నాలుగైదు సినిమాలు పెద్ద డిజాస్టర్లు అయ్యాయి. అయినా హీరో రెమ్యూనరేషన్ విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గటం లేదు. ఇది ఇలా ఉంటే ఆ హీరో ఇటీవల తన డూప్ అదే బాడీ డబుల్ తో ఎదుర్కొన్న ఒక వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో సరికొత్త చర్చకు దారి తీసింది. సదరు సీనియర్ హీరోకు ఇద్దరు బాడీ డబుల్స్ ఉండేవారు ఒకరు షేప్ అవుట్ అవ్వడంతో ప్రస్తుతానికి ఒక‌రు మాత్రమే పనిచేస్తున్నారు. మామూలుగా సదర్ హీరో సినిమా షూటింగ్ కి లేటుగా వెళుతూ ఉంటాడు .. ఈలోపు ఫేస్ కనపడకుండా తీయాల్సిన షాట్లు ఏమైనా ఉంటే సదరు బాడీ డబుల్ తో షూట్ చేసుకుంటూ ఉంటారు. దర్శకులు ఇటీవల కాలంలో ఒక సినిమా షూటింగ్ కి హీరో వెళ్లిన చాలాసేపటికి కానీ సదరు బాడీ డబుల్ రాలేదట.


ఇంత ఆలస్యంగా వచ్చావు నీకంటే నేను ముందు వచ్చాను అని ఆ హీరో ఆ బాడీ డబుల్‌ మీద ఆగ్రహం వ్యక్తం చేశారట. వెంటనే సదర్ హీరో మీరు హీరోగా నటిస్తున్న మరో సినిమాకి సంబంధించిన ప్యాచ్ వర్క్ కోసం దర్శ‌కుడు పిలిస్తే వెళ్లి వచ్చానని చెప్పాడట. దీంతో షాక్ అయిన హీరో సదరు దర్శకుడు తనకు చెప్పకుండా త‌న సినిమా ప్యాచ్ వ‌ర్క్‌ పూర్తి చేస్తున్నాడని ఆలోచన రావటం షాక్ కలిగింద‌ట. ఇది ఒక హీరో కథ .. మరో హీరో ఏమో తన బాడీ డబుల్ తోనే 10 కోట్ల రూపాయల విలువైన ఒక ఫైట్ కంపోజ్ చేయించారట .. అంతా అయిపోయిన తర్వాత అవుట్ పుట్ చూసుకుని ఇదేమి బాలేదు ఇప్పుడు నేనే చేస్తాను అని రంగంలోకి దిగాడట. ఏది ఏమైనా ద‌ర్శ‌కులు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా బాడీ డబుల్స్ వాడటం హీరోలకు ఇబ్బందికర పరిణామమే అని చెప్పాలి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో హీరో అనేవాడు పూర్తిగా డమ్మీ అయిపోతాడు .. హీరోలకు విలువ లేకుండా పోతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: