తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ఈయన కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 1 అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయగా ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలోని అల్లు అర్జున్ నటనకు ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. పుష్ప పార్ట్ 1 మూవీ సూపర్ సక్సెస్ కావడంతో పుష్ప పార్ట్ 2 మూవీ పై ఇండియా వ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి.

అలా భారీ అంచనాల నడుమ ఈ సినిమా పోయిన సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ఇండియా వ్యాప్తంగా భారీగా పెరిగిపోయింది. పుష్ప లాంటి కమర్షియల్ మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న అల్లు అర్జున్ మళ్లీ అలాంటి కమర్షియల్ మూవీలను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయిన డైరెక్టర్లతో పని చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. బన్నీ తన తదుపరి మూవీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ప్రస్తుతం మాత్రం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి అట్లీ తో బన్నీ తన నెక్స్ట్ మూవీ ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక అట్లీ పక్క కమర్షియల్ మూవీలను తీయడంలో స్పెషలిస్ట్. ఇప్పటివరకు ఈయన ఎన్నో సినిమాలను రూపొందించి అన్నింటితో కూడా మంచి విజయాలను అందుకున్నాడు. ఇక బన్నీ , అట్లీ తో మూవీ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్త తో బన్నీ సినిమా చేయనున్నట్లు , ఆ మూవీ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి బన్నీ తన లేనప్ ను ఎలా సెట్ చేసుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa