నిన్నటి రోజు నుంచి స్టార్ సింగర్ కల్పన ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడంతో ఒకసారిగా తెలుగు ఇండస్ట్రీ ఉలిక్కి పార్టీకి గురయ్యింది. దీంతో కొంతమంది సింగర్ కల్పన పైన పలు రకాల రూమర్స్ కూడా సృష్టించారు. మల్కాజిగిరి జిల్లాలోని నిజాంపేటలో తన భర్తతో కలిసి నివాసం ఉంటున్న సింగర్ కల్పన నిద్ర మాత్రలు ఎక్కువగా మింగిందని దీంతో ఆమె రెండు రోజుల నుంచి డోర్ వేసుకొని గదిలోనే ఉండిపోవడంతో అక్కడి స్థానికులు గమనించి తన భర్తకు సమాచారం ఇవ్వగా వెంటనే తన భర్త పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కల్పన ఇంటి డోర్లు పగలగొట్టి పోలీసులు వెళ్లగా కల్పన అప్పటికే అపస్మరక స్థితిలోకి వెళ్లిపోయిందట. దీంతో వెంటనే వారు హాస్పిటల్ కి కల్పనన్ని తరలించారు.


దీంతో కల్పన సూసైడ్ అటెంప్ట్ చేసిందనే విధంగా వార్తలు వినిపించాయి.. భర్తతో గొడవల కారణం వల్లే ఇలా చేసుకుందని రూమర్స్ వినిపించగా.. ఈ విషయం పైన కల్పన కూతురు కూడా స్పందించడం జరిగింది..తన తల్లిది ఆత్మహత్య ప్రయత్నం కాదని అలాంటి వార్తలు ఎవరు ప్రచారం చేయొద్దని టాబ్లెట్ ఓవర్డోస్ అవడం వల్లే ఇలా జరిగిందని వెల్లడించింది. అయితే ఈ విషయంపైన సింగర్ చిన్మయి రియాక్ట్ అయ్యింది.


ఈ మేరకు చిన్మయి ట్విట్టర్ ద్వారా ఇలా తెలియజేస్తూ.. ప్రముఖ సింగర్ కల్పన సంఘటనకు సంబంధించిన వార్త అందరూ కూడా సానుకూలంగా బాధ్యతాయుతంగానే నివేదించాలంటూ ఆమె తెలియజేసింది.. ఎలాంటి రూమర్స్ అయినా సరే కచ్చితంగా స్ప్రెడ్ చేసిన అది ఆమె కుటుంబం మీద ప్రభావం చూపుతుంది.అలా చేయకండి అంటూ తెలిపింది. అసలు సింగర్ కల్పనతో సంబంధం లేని వారిని కూడా తీసుకువచ్చి కొన్ని మీడియాలు డిబేట్లు పెడుతున్నారు.. ఇంతకంటే వరస్ట్ పని ఏమి ఉంటుంది అంటూ తెలియజేసింది. మీడియాకు ఎథిక్స్ లేవా ఇలాంటి చర్చలలో పాల్గొనకండి అంటూ తెలిపింది. రూల్స్ ఎవరు పాటించడం లేదు అంటూ ఫైర్ అయ్యింది చిన్మయి.

మరింత సమాచారం తెలుసుకోండి: