టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ చిరంజీవి నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ప్రస్తుతం తండ్రిని మించిన తనయుడుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరో తనయుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం అంటే ఆడియన్స్ లో ఏ లెవెల్ లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన డ్యాన్స్, గ్రేస్, నటన అన్నిటిని పునికి పుచ్చుకునే సినిమాల్లో నటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే చిరంజీవి వారసుడిగా చరణ్ పెద్ద బాధ్యతలనే మూటగట్టుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అలా 2017లో చిరుత సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన చరణ్.. తన డ్యాన్స్‌, మేనరిజంతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు.
 

ఈ క్రమంలోనే చిరుత ఓ మోస్తారు సక్సెస్‌ను అందుకుంది. ఇక అప్పట్లో స్టార్ డైరెక్టర్‌గా రాణించిన పూరి జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా కోసం నిర్మాత అశ్వినీ ద‌త్త్‌ రామ్ చరణ్‌కు ఏకంగా రూ.50 లక్షల రెమ్యున‌రేషన్ ఇచ్చాడట. ఓ డబ్యూ హీరోకి ఈ రేంజ్‌లో రెమ్యూనరేషన్ అంటే కాస్త ఎక్కువే. కానీ.. చిరు వారసుడుగా రావడంతో సినిమాపై హైప్‌ పెరిగి మార్కెట్ కూడా అదే లెవెల్‌లో జరిగింది. దీంతో అశ్విని ద‌త్త్ అరేంజ్‌లో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఇష్టపడ్డారు. కాగా రామ్ చరణ్ ఈ విషయంపై ఇంటర్వ్యూలో రియాక్ట్ అవుతూ.. అశ్విని దత్త్ గారు నాకు కాల్ చేసి.. నీ రెమ్యున‌రేషన్ చెక్‌ నీకు ఇవ్వాలనుకుంటున్న.. ఇంటికి వస్తున్నానని చెప్పారని.. సరే నేను పైనే ఉంటాను.. కిందకు రాను.. అమ్మకు ఆ చెక్ ఇచ్చేయండి అని చెప్పానని రామ్ చరణ్ వివరించాడు.

 

అంటే రాంచరణ్ తన తల్లి సురేఖకు ఫస్ట్ రెమ్యూనరేషన్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తన ఫస్ట్ సంపాద‌న‌ తల్లి సురేఖకు ఇచ్చేశారు. ఇక‌ ప్రస్తుతం చరణ్ సినిమాల విషయానికొస్తే.. చివరిగా గేమ్ ఛేంజ‌ర్ రిజ‌ల్ట్ నిరాశపరిచినా తన 16వ‌ సినిమాతో భారీ స‌క్స‌స్ అందుకోవాల‌ని క‌సితో ఉన్నాడు. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో నటిస్తున్న ఈ సినిమాలో.. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెల‌కొన్నాయి. ఈ సినిమా తర్వాత.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్తో ఆయన మరో సినిమా నటించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: