బాలీవుడ్లో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతున్న చిత్రం ఛావా.. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయాలని భారీ డిమాండ్ ఉండడంతో ఈ సినిమాని తెలుగులో ఈనెల 7వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ తో దూసుకు వెళ్తుందనుకుంటున్న సమయంలో ఏపీలో ఒక వర్గం వారు దీనిపైన అభ్యంతరాన్ని తెలియజేస్తూ ఉన్నారట. ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ ఛావా సినిమా పైన అధికారికంగా స్పందించడం జరిగింది. ఛావా సినిమాను చరిత్రను వక్రీకరించి తీసిన చిత్రంగా ముస్లిం ఫెడరేషన్ మహమ్మద్ జియా ఉల్ హక్ తెలియజేస్తున్నారు.


దీంతో ఛావా చిత్రాన్ని ఏపీలో విడుదల చేయకుండా చూడాలంటూ పలు రకాల డిమాండ్లను కూడా చేస్తున్నారట. ఈ మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్కు సైతం కొన్ని వినతి పత్రాలను కూడా అందజేశారట. ఈ సినిమా కథను తారుమారు చేయడం వల్ల కొంతమంది మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని అందుకే తమ అభ్యంతరాన్ని ఇలా ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చామంటూ వెల్లడించారట ముస్లిం ఫెడరేషన్ మహమ్మద్.. ఇప్పటికే మహారాష్ట్రలో శంబాజీ మహారాజ్ భక్తులు కూడా భారీ స్థాయిలో ఛావా సినిమాని ప్రోత్సాహిస్తూ ఉన్నారు.


అయితే మరికొన్ని ప్రాంతాలలో మాత్రం ఛావా సినిమా పైన అసంతృప్తిని తెలియజేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్లో 600 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.దీంతో తెలుగులో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తే భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది అనుకుంటున్నా సమయంలోనే ఇలా రిలీజ్ కాకముందే వివాదాలు మొదలు కావడంతో చిత్ర బృందానికి కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ లో ఈ సినిమా తెలుగులో విడుదల కాబోతోంది. మరి ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుందా లేదా అని అనుమానాలతో అభిమానులు ఉన్నారు. మరి ఈ విషయం పైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నది. ఛావా సినిమా శంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తీశారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది చేత ప్రశంసలు అందుకుంది చాలా మూవీ.

మరింత సమాచారం తెలుసుకోండి: