
హిందీతో పాటు.. సౌత్ లోను ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ స్టార్ బ్యూటీ చేతిలో పలు క్రేజీ సినిమాలు ఉన్నాయి. రాక్ స్టార్ యష్ రాబోయే సినిమా టాక్సిక్‌లో కూడా.. కియారా అధ్వని హీరోయిన్. అలాగే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్ 2లో కూడా ఈమె నటిస్తుంది. అయితే.. ఇప్పుడు డాన్ 3 సినిమాని ఫర్హాన్ దత్త దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడు. అతనికి జంటగా కియారా అద్వానీ హీరోయిన్గా నటించబోతుంది. గతంలోను ఇది అఫీషియల్ గా ప్రకటించారు. అయితే.. ప్రెగ్నెంట్ అయిన తర్వాత వరుస షూటింగ్లకు వెళ్ళటం కష్టమని భావించి.. హీరోయిన్గా డాన్ 3 నుంచి కియారా తప్పుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి.
అలాగే డౌన్ 3 సినిమా యూనిట్ నుంచి కూడా కియారా బయటికి వెళ్ళింది. కాబట్టి.. ఇప్పుడు మరో హీరోయిన్ ఎంపిక చేయాల్సిన పనిపడింది. అయితే.. ప్రస్తుతం ఎదురవుతున్న ఈ పరిణామాలు అన్నిటి గురించి.. చిత్ర యూనిట్ కానీ.. హీరోయిన్ కియారా నుంచి గాని.. ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే త్వరలోనే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి అధికారం ప్రకటన రానుందని అంటున్నారు. ఇవే కాకుండా కియారా ఇతర అనేక సినిమాల్లో కూడా నటిస్తుంది. అయితే ప్రెగ్నెన్సీ కారణంగా మరికొన్ని సినిమాలు నుంచి కూడా ఈమె తప్పుకునే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు.