
అయితే ఇందులో హీరోయిన్ కుబ్రా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అన్ని విషయాలను వెల్లడించింది.. 2013లో ఒక రాత్రి ప్రేమాయణం తర్వాత తాను గర్భవతినయ్యానంటూ వెల్లడించింది. ఈ విషయాన్ని కూడా పుస్తకంలో తెలియజేసింది. అయితే ఎవరికీ తెలియకుండానే ఈమె రహస్యంగా గర్భస్రావాన్ని కూడా చేయించుకున్నదట. దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత మళ్లీ కుబ్రా ఈ సంఘటన గురించి మాట్లాడడం జరిగింది. అబార్షన్ చేయించుకోవాలని ఎందుకు చేయించుకోవలసి వచ్చింది? ఆ సమయంలో తన మానసిక స్థితి ఎలా ఉందో ఇప్పుడు మరొకసారి తెలిపింది.
ఇటీవలే బాలీవుడ్ లో బబుల్ అనే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కుబ్రా.. తాను గర్భ స్రావం చేయించుకోవాలనుకున్నప్పుడు ఆ కష్ట సమయాన్ని దాటాలనుకున్న సమయంలో చాలా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. తాను గర్భస్రావం చేయకపోతే ఆ బిడ్డ జీవించే ధైర్యం తనకు లేదని.. ఇది తన జీవితం పైన చాలా ప్రభావాన్ని చూపించిందని తాను చాలా ప్రతికూలంగా ఉన్నాను ఆ సమయంలోనే బిడ్డకు జన్మనివ్వడానికి తాను అర్హురాలని కాదనిపించే ఆ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. అయితే తాను గర్భం దాల్చిన విషయం ఎవరికీ తెలియదు స్వయంగా తాను ఆసుపత్రికి వెళ్లి అబార్షన్ కూడా చేయించుకున్నానని తెలియజేసింది.. రెండు మూడు వారాలు ఆలోచించిన తర్వాతే ఒక కాఫీ షాప్ లో తన స్నేహితుని కలిసి ఈ విషయాన్ని చెప్పగా ఆమె షాక్ షాక్ అయ్యిందని.. అయితే ఈ విషయం గురించి తాను ఎవరికీ చెప్పలేదని విషయాన్ని ఆమె గ్రహించి ఏడవడం మొదలుపెట్టిందని చెప్పుకొచ్చింది.