
టాలీవుడ్ లో ఉన్న టైర్ 2 యంగ్ క్రేజీ హీరోలలో రామ్ ఒకరు. యంగ్ ఎనర్జిటిక్ హీరో అయిన రామ్ గత కొన్నేళ్లు గా వరుస పెట్టి సినిమా లు చేస్తున్నా సరైన హిట్ పడడం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వం లో రామ్ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. బారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ఏ మాత్రం అంచనాలు అందుకోలేక పోయింది. రామ్ హీరోగా ప్రస్తుతం దర్శకుడు మహేష్ బాబుతో ఓ క్లీన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక రామ్ ఇప్పటి వరకు వరుసగా అన్నీ మాస్ సినిమాలే తాను చేయగా ఇపుడు మళ్ళీ తనకి సూటయ్యే క్లాస్ ట్రాక్ లోకి వచ్చాడు. ఓ క్రేజీ డైరెక్టర్ తో క్రేజీ ప్రాజెక్టు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ క్రేజీ ప్రాజెక్టు పై ఇపుడు ఓ ఇంట్రెస్టింగ్ బజ్ తన లైనప్ పై వినిపిస్తుంది. ప్రస్తుతం రామ్ మరో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకునికి ఓకే చెప్పనట్టుగా సమాచారం.
ఆ క్రేజీ డైరెక్టర్ ఎవరో ? కాదు ... టాలీవుడ్ లో “ హిట్ ” సినిమా యూనివర్స్ ని పరిచయం చేసిన యువ దర్శకుడు శైలేష్ కొలను తో రామ్ ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ క్రేజీ కాంబినేషన్లో ఓ ఊర మాస్ ప్రాజెక్ట్ చర్చల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ సినిమా ను టాలీవుడ్ డైనమిక్ ప్రొడ్యూసర్ సూర్య దేవర నాగవంశీ ట్రాక్ లో కి తీసుకు రానున్నట్టుగా టాక్. ఈ సినిమా పై అధికారిక ప్రకటన వస్తే టాలీవుడ్ లో ఖచ్చితంగా క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది అనడం లో సందేహం లేదు.