
కొన్ని సినిమాలు కొందరి కెరీర్ ని ఒక్కసారి వెనక్కి లాగేస్తాయి. అక్కినేని నవ మన్మథుడు అఖిల్ ‘ ఏజెంట్ ’ కూడా అలాంటి సినిమానే అని చెప్పాలి. పాన్ ఇండియా చుట్టేయాలనే తనపతో ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకు వెళ్లాడు టాలీవుడ్ స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి. టాలీవుడ్ లో ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు తీసిన అగ్ర నిర్మాత అనిల్ సుంకర కూడా ఈ ప్రాజెక్ట్ పై చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. అయితే సినిమా బడ్జెట్ చాలా ఎక్కువ అయ్యింది .. దాదాపు పలు సార్లు వాయిదాలు పడుతూ ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత రిలీజ్ అయ్యి పెద్ద డిజాస్టర్ అయ్యింది.
చివరకు ఏజెంట్ ఎంత డిజాస్టర్ అయ్యింది అంటే ఓపెనింగ్ రోజే క్లోజింగ్ డే అయినంత డిజాస్టర్. ఈ సినిమా మేకింగ్ లో ఎలాంటి లోపాలు జరిగాయో కాని .. చివరకు ఓటీటీలో కి రావడానికి కూడా రెండేళ్ళు ఎదురు చూపులు చూడాల్సి వచ్చింది. ఇక ఏజెంట్ ఈ నెల 14న సోనీలీవ్ లో ప్రసారం కాబోతోంది. తమ హీరో సినిమా కనీసం ఓటీటీలోకి కూడా రాలేదని బాధపడుతున్న అఖిల్ ఫ్యాన్స్ కి ఇదొక పెద్ద ఊరట అని చెప్పాలి.
ఇక ఈ సినిమా ఎఫెక్ట్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి పై గట్టిగా పడింది. ఇప్పటికీ సురేందర్ రెడ్డి కొత్త సినిమా ప్రకటన రాలేదు. ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నా ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వట్లేదు. సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా అనుకున్నారు. హైదరాబాద్ లో కొత్త ఆఫీస్ తీసి పూజ కూడా చేశారు. కానీ సినిమాకి బ్రేకులు పడ్డాయి. . ఇది కాదని సీనియర్ హీరో వెంకటేష్ తో ఓ సినిమా అనుకుంటున్నారు. అది కూడా ఇప్పుడు క్యాన్సిల్ అయినట్టు టాక్ ?