
తెలుగు సినిమా దగ్గర తిరుగులేని క్రేజ్ ఉన్న హీరోల లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ కళ్యాణ్ ఇపుడు సినిమాల తో సహా రాజకీయాలు రెండూ చేస్తున్నారు. పవన్ రెండు పడవ ల ప్రయాణం మామూలుగా లేదు. ఇక పవన్ పాలిటిక్స్ లో ఫుల్ టైం బిజీగా ఉన్న సమయం లో కూడా పవన్ వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. పవన్ నటిస్తోన్న సినిమా లలో మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి.
హరిహర వీరమల్లు - ఓజీ - ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా లు లైన్లో ఉన్నాయి. ఇక వీటిల్లో ముందుగా వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుంది. పవన్ ఫస్ట్ టైం ఒక వారియర్ రోల్ లో హరిహర వీరమల్లు అనే సినిమా అనౌన్స్ అయ్యినపుడు మామూలు హైప్ లేదు. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లాక పవన్ భీమ్లా నాయక్, వకీల్ సాబ్, బ్రో అనే మూడు రీమేక్ సినిమాలు చేయడం .. రిలీజ్ కావడం కూడా జరిగి పోయాయి. అయితే ఇంకా వీరమల్లు పూర్తి కాలేదు. ఇంకా ఎప్పటకి పూర్తవుతుందో ? కూడా తెలియని పరిస్థితి.
అయితే ఈ సినిమా పై అభిమానుల్లోనే అంచనాలు పెద్దగా లేవు. సినిమా ఎన్నోసార్లు వాయిదా కూడా పడుతుండడంతో జెనరల్ ఆడియెన్స్ కి కూడా ఎప్పుడో రావాల్సిన సినిమా ఇప్పుడుకి అవుట్ డేటెడ్ అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లపైనే ప్రభావం చూపించే అవకాశం ఎక్కువగా ఉందన్న సందేహాలు బాగా వినిపిస్తున్నాయి. వీరమల్లు కు నామమాత్ర పు బిజినెస్ .. నామమాత్రపు వసూళ్లే వస్తాయంటున్నారు. ఇక ఈ సినిమా కు పెద్దగా లాంగ్ రన్ కూడా ఉండే ఛాన్సు లే లేవని అంటున్నారు.