టాలీవుడ్ లో ఓ యంగ్ డైరెక్టర్ ఉన్నాడు. ఇద్దరు సీనియర్ హీరోలతో వరుసగా రెండు మంచి హిట్ సినిమాలు తీశాడు. ఆ రెండు సినిమాలు కూడా కాగితాల మీద పెద్ద హిట్లు అయ్యాయి. అయితే ఆ సినిమాలు నిర్మించిన నిర్మాతలకు పెద్దగా లాభాలు రాలేదు. మూడేళ్ల క్రితం సంక్రాంతి కి ఓ సీనియర్ హీరోతో తెరకెక్కించిన సినిమాకు భారీ బడ్జెట్ .. భారీ కాస్ట్ అయ్యింది. పైగా హీరోకు టాప్ రెమ్యునరేషన్ .. ఇక అందరిని టాప్ టెక్నీషియన్లనే వాడేస్తాడు. బడ్జెట్ నిర్మాత పెట్టుకుంటాడు .. ఆ డైరెక్టర్ కు పోయేదేం ఉంటుంది.. ఇక తాజాగా సంక్రాంతికి అదే డైరెక్టర్ మరో స్టార్ హీరో తో సినిమా చేశాడు. బడ్జెట్ చాలా ఎక్కువ అయ్యింది.. మంచి సినిమా చేశాడన్న పేరు వచ్చిందే కాని .. నిర్మాతలకు లాభాలు పెద్దగా రాలే దు అన్నది వాస్తవం.
ఇక ఇప్పుడు ఆ డైరెక్టర్ తాను ఇంతకు ముందు హిట్ ఇచ్చిన సీనియర్ హీరో తో సినిమా చేస్తానని ప్రచారం చేసుకుంటున్నాడు. ఆ సీనియర్ హీరో కూడా ఇందుకు సుముఖం గానే ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ క్రేజీ హిట్ కాంబినేషన్ కు నిర్మాతలు దొరకని పరిస్థితి. ఎందుకంటే ఎలాగూ ఆ డైరెక్టర్ టాప్ టెక్నీషియన్ల ను తీసేసుకుంటాడు .. వారికి భారీ గా రెమ్యునరేషన్‌లు ఇవ్వాలి. బడ్జెట్ ఎలా లేదన్నా రు. 200 కోట్లు అవుతుంది. సినిమా హిట్ అయినా నిర్మాతలకు మిగి లేది ఏం ఉండదు అన్న నిర్ణయానికి వచ్చేసే ఈ కాంబినేషన్లో సినిమా తీసేందుకు ఏ నిర్మాత కూడా ముందుకు రావడం లేదట. ఏదేమైనా సదరు డైరెక్టర్ కాస్త క్రియేటివి టి జోడించి నిర్మాత కు ఓ రూపాయి లాభం వచ్చేలా సినిమా తీస్తే బాగుంటుంది.