
- పెళ్లి చేసుకోవాలని తమన్నా పట్టు .. !
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .
మిల్కీ బ్యూటీ తమన్నా .. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ఎంతో కాలం నుంచి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరు విడిపోయారంటూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రెండేళ్ల ప్రేమకు ఇక పై వీరు పులిస్టాప్ పెట్టేసి ఇకపై స్నేహితులుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. తమన్నా - విజయవర్మ ప్రేమ బంధం కొనసాగించకపోవడానికి కారణం ఏమై ఉంటుందా ? అన్నది సంచలనంగా మారింది. కేరిర్ . . పెళ్లి విషయంలో వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయట. 35 ఏళ్ల వయసులో ఉన్న తమన్నా పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ కావాలని నిర్ణయించుకున్నారని ... విజయవర్మ మాత్రం అందుకు ఓకే చెప్పలేదని సమాచారం. విజయవర్మ ప్రస్తుతం కెరీర్ పై దృష్టి పెట్టాలని అనుకుంటున్నారని ఈ క్రమంలోనే వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని తెలుస్తోంది.
అందుకే విడిపోయారని అంటున్నారు 2023లో రిలీజ్ అయిన కోసం తొలిసారి కలిసి పనిచేశారు. ఆ టైంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు .. అక్కడి నుంచి ఎంతో కలిసి ఉన్నారు. తనను విజయ్ ఎంతో గౌరవిస్తాడని ఎంతో అర్థం చేసుకున్నాడని తన ఇష్టాన్ని బయటపెట్టింది. తమన్నా వీరిద్దరూ త్వరలో నే పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో నే వీరు బ్రేకప్ కథనాలు సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురిచేసాయి. ఇక తాము విడిపోతున్నామంటూ వస్తున్న వార్తలపై అటు తమన్నా కానీ ఇటు విజయ వర్మ కాని స్పందించలేదు. ప్రస్తుతం తమన్న ఓదెలా 2 కోసం పనిచేస్తున్నారు . ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది.