
ప్రస్తుతం ఈ సినిమా షూట్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు మహేష్. ఇక ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం మహేష్ బాబుకు తిరుగుండదు అనడంలో అతిశయోక్తి లేదు. ఐదు పదుల వయసు మీద పడుతున్నా.. హాలీవుడ్ హీరోలను మించిన అందంతో మహేష్ యూత్‌ను ఆకట్టుకుంటున్నాడు. ఇలాంటి నటుడు.. ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో మరెవరూ లేరు అనడంలో అతిశయోక్తి లేదు. కానీ.. మహేష్‌తో పాటు.. నటనలో పోటీపడే కెపాసిటీ ఉన్న ఏకైక టాలీవుడ్ హీరో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అంటూ.. ఆయనకు నటనపరంగా తారక్ తప్ప మరెవరు సాటిరారని చాలామంది సినీ మేధావులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
అయితే చరణ్, అల్లు అర్జున్ అభిమానులు మాత్రం తమ హీరోలు సైతం మంచి నటనతో నేషనల్ లెవెల్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్నారని.. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మొదటినుంచి జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబుల మధ్యన మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తే బాగుండని టాలీవుడ్ ఆడియన్స్ అంతా ఎప్పటినుంచి కోరుకుంటున్నారు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.. ఫ్యూచర్ లో అయిన వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందో లేదో వేచి చూడాలి.