
మరి ముఖ్యంగా బాహుబలి సినిమా టైంలో ప్రభాస్ బాలీవుడ్ ఓ షో లో పాల్గొన్నారు. ఆ షోలో ప్రభాస్ కు ఒక టఫ్ క్వశ్చన్ ఎదురైంది. " మీకు అనుష్కకు మధ్య ఏముంది ..? మీరు ప్రేమించుకుంటున్నారా..? మీకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎన్నో ఎన్నో వైరల్ అవుతున్నాయి ..?దానిపై మీ స్పందన ఏంటి..?" అంటూ హోస్ట్ ప్రశ్నించారు . దీనికి ప్రభాస్ చాలా స్టన్నింగ్ ఆన్సర్ ఇచ్చారు . "మా మధ్య ఏమీ లేదు.. మేము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే "అంటూ చెప్పుకొచ్చారు .
"కావాలంటే పక్కనే ఉన్న రాజమౌళి ని..హీరో రానా ని అడగండి "అంటూ వాళ్ళ సైడ్ ఫింగర్ చూపిస్తారు . "వాళ్ళు కూడా అవును వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ మాత్రమే ..ట్రూ "అంటూ చెప్పుకొస్తారు. అయితే ఎందుకు మరి ఇలా రూమర్స్ వస్తున్నాయి అని ప్రభాస్ ని మళ్ళీ ప్రశ్నించగా.." కేవలం నాపైనే కాదు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు హీరోయిన్ ల విషయంలో ఇది జరిగింది. ఏ హీరోయిన్-హీరో అయినా సరే రెండేళ్లు కలిసి వర్క్ చేస్తే కచ్చితంగా వాళ్ళ ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు వచ్చేస్తాయి . అందుకుకు నేను అతీతుడు ని ఏమీ కాదు "అనే రేంజ్ లోనే క్లారిటీ ఇచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో అప్పుడు ప్రభాస్ మాట్లాడిన మాటలు చాలా చాలా ట్రెండ్ అయ్యాయి. మరొకసారి ఇదే వీడియోని వైరల్ చేస్తున్నారు జనాలు. కానీ ఫ్యాన్స్ మాత్రం వీళ్ల మధ్య ఏదో ఉంది అనే రేంజ్ లోనే మాట్లాడుకుంటున్నారు..!!