రాజమౌళి - నయనతార .. ఈ కాంబోలో సినిమానా ..? నిజంగానే ఇది వర్కౌట్ అవుతుందా ..? ఏమో ఇప్పుడు పరిస్థితి ప్రకారం వర్కౌట్ కాకపోవచ్చు ఎందుకంటే ..? నయనతార పెద్ద స్టార్ హీరోయిన్ . రాజమౌళి ఓ పెద్ద డైరెక్టర్. తన సినిమా కమిట్ అయితే ఆ హీరోయిన్ మరి ఏ సినిమాలో కూడా కొన్ని ఏఅళ్ళ పాటు నటించకూడదు . అది నిజంగా నయనతార కి వర్కౌట్ అవ్వని పని అని చెప్పాలి . నయనతార ఫుల్ బిజీబిజీగా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది . అయితే గతంలో మాత్రం నయనతార రాజమౌళి కాంబోలో సినిమా రావాలి అంటూ చాలా చాలా కృషి చేశారట .


కానీ ఆ సినిమాని నయనతారనే రిజెక్ట్ చేసిందట . రాజమౌళి దర్శకత్వం అని తెలిసిన కూడా నయనతార రిజెక్ట్ చేయడానికి మెయిన్ కారణం ఆయన పెట్టిన కండిషన్స్ అంటూ కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి . ఆ సినిమా మరేదో కాదు మగధీర . యస్ మగధీరనే. రాజమౌళి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ఇదే, మగధీర సినిమాలో ముందుగా హీరోయిన్గా అనుష్కను అదే విధంగా నయనతారను అనుకున్నారట . కానీ ఇద్దరు కూడా ఈ క్యారెక్టర్స్ రిజెక్ట్ చేశారట.

 

హీరోయిన్ అనుష్క అయితే రామ్ చరణ్ పక్కన సిస్టర్ లా ఉంటాను అంటూ రిజెక్ట్ చేస్తే ..హీరోయిన్ నయనతార మాత్రం రాజమౌళి కండిషన్స్ భరించలేనే లేను అంటూ రిజెక్ట్ చేసిందట. అలా నయనతార అదేవిధంగా రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కాల్సిన సినిమా మిస్సైంది. రాజమౌళి కూడా నయనతార తో సినిమా చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించారట. ఇక ఫ్యూచర్లో వీళ్ళ కాంబోలో సినిమా వస్తుంది అన్న అసలు ఏ ఒక్క అభిమానికి కూడా లేవు. వీళ్ల కాంబోలో సినిమా రావాలి అన్నది ఓ కల గానే మిగిలిపోయింది జనాలకి...!

మరింత సమాచారం తెలుసుకోండి: