సోషల్ మీడియాలో ఏ విషయమైనా సరే చాలా చాలా ఎక్కువగా సీరియస్ గా తీసుకుంటూ ఉంటారు అభిమానులు.  మరీ ముఖ్యంగా తమ ఫేవరెట్ హీరో విషయంలో కానీ హీరోయిన్ విషయంలో కానీ ఎటువంటి నెగిటివ్ ట్రోలింగ్ జరిగిన అక్కడికక్కడ ఇచ్చిపడేస్తూ ఉంటారు . తాట తీసేస్తూ ఉంటారు . ఆ హీరోయిన్ గాని హీరో విషయం ఎక్కువగా వైరల్ అవ్వడానికి చూస్తూ ఉంటారు . ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న ఇద్దరు హీరోయిన్ల పేర్లు జనాలు మాట్లాడుకుంటున్నారు .


వాళ్ళిద్దరు కూడా తెలుగు బ్యూటీలే కావడం గమనార్హం. వాళ్ళు మరెవరో కాదు రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఐశ్వర్యరాజేష్. అదే విధంగా "గేమ్ ఛేంజర్" సినిమాలో తనదైన స్టైల్ లో నటించి మెప్పించిన అంజలి . ఇద్దరు కూడా తెలుగు అమ్మాయిలే . కానీ తెలుగులో కన్నా కూడా కోలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేసి పాపులారిటీ సంపాదించుకొని తద్వారా తెలుగులో అవకాశాలు అందుకున్నారు ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు. కాగా ఇద్దరు కూడా మంచి టాలెంట్ ఉన్న నటులే .



మరీ ముఖ్యంగా అంజలి - ఐశ్వర్యరాజేష్ సిద్దరు కూడా నిర్మొహమాటంగా ఉన్నది ఉన్నట్లే ముఖానే మాట్లాడేస్తారు . అయితే వీళ్ళిద్దరిలో మాత్రం ఒక డిఫరెన్స్ ఉంది అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు . అంజలి రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంది అని.. తన సినిమాకి ఇలాంటి రెమ్యూనరేషన్ ఉండాలి అంటూ కండిషన్స్ పెడుతుందని.. ఐశ్వర్య రాజేష్ ఎంత తక్కువ ఇచ్చినా సరే సినిమాను ఓకే చేసేస్తుంది అని . వీరిద్దరి మధ్య రెమ్యూనరేషన్ ఢిఫరెన్స్ తప్పిస్తే మిగతా అన్ని కూడా సేమ్ టు సేమ్ అని పరోక్షంగా ప్రత్యక్షంగా చెప్పాలి అంటే ఇద్దరు అక్కచెల్లెళ్ల టైపే అని చెప్పాలి అంటున్నారు. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ బాగా వైరల్ గా మార్చేశారు ఫ్యాన్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి: