ప్రస్తుతం సినిమాలు నటించడం తగ్గించిందేమో కానీ.. ఒకప్పుడు వరుస ఐటమ్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్.. హాట్‌ బ్యూటీ ముమైత్ ఖాన్. తన హాట్ డ్యాన్స్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది ఈ అందాల ముద్దుగుమ్మ. పోకిరిలో ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే సాంగ్‌తో భారీ క్రేజ్ తెచ్చుకుంది ముమైత్ ఖాన్. ఆ తర్వాత.. ప్రభాస్ నటించిన యోగి సినిమాలో ఓరోరి యోగి సాంగ్ తో భారీ క్రేజ్ తెచ్చుకుంది. అలా ఆ తర్వాత టాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించిన ముమైత్‌ కేవలం నాలుగు సంవత్సరాల్లోనే యాభైకి పైగా సినిమాల్లో నటించి.. క్రేజీ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. అలాగే తన డిమాండ్‌కు తగ్గట్టుగానే రెమ్యునరేషన్ కూడా అందుకుంది.  


అప్పట్లోనే ఒక్కో పాట కోసం ఏకంగా రూ.50 లక్షలకు పైగా రెమ్యునరేషన్ అందుకుందంటే ముమైత్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఈ ముద్దుగుమ్మ ఐటెం సాంగ్స్‌కే పరిమితం కాకుండా.. పలు సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రలో కూడా నటించింది. అలాగే పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసింది. ఇక ఈ బ్యూటీ తెలుగుతోపాటు.. హిందీ, తమిళ, కన్నడ, మలయాళం.. ఇలా అన్ని భాషల్లో కూడా సినిమాలు చేసింది. అయితే.. ఊహించిన విధంగా హీరోయిన్‌గా మారినా స్పెషల్ సాంగ్ చేయడంతో ముమైత్ కు సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అయితే చివరగా ఈ బ్యూటీ ఆర్ డి ఎక్స్ లవ్ సినిమాలో నటించింది.

 

అయితే సినిమాలతో పాటు.. పలు టీవీ షోలలోను, ప్రోగ్రామ్స్ లోను ఈమె సంద‌డి చేసింది .  ముమైత్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 1లో మెయిన్ కంటెస్టెంట్‌గా వెళ్ళింది.  లవ్ యు బిగ్ బాస్.. నాన్ స్టాప్ ఓటీటీలో కూడా ఈమె సందడి చేసింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూనే.. సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అయితే ముమైత్ ఖాన్ చెల్లెలు కూడా తెలుగులో క్రేజీ నటి అనే విషయం చాలామందికి తెలియదు. ఇది నిజమే.. ఆమె పేరు జబీనా ఖాన్. కేవలం ఈమె నటిగానే కాకుండా.. తెలుగులో చాలా సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా వర్క్ చేసింది. జబీనా తెలుగులో ఎన్నో సినిమాల్లో సైడ్ హీరోయిన్గా కూడా నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కూడా సినిమాలకు దూరంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: