టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళికీ అభిమానులు ఎన్నో రకాల బిరుదులతో ఆయనను ముందుగా పిలుస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి రాజమౌళి అనే పేరు వినగానే చాలామంది మాత్రం పులకించబోతూ ఉంటారు. అయితే రాజమౌళి సినిమాలో చూస్తూ కొన్ని అంశాలు కూడా అంతకుముందు ఏదో ఒక చిత్రంలో ఉన్న భావన కూడా అందరికీ కలుకుతూ ఉంటుంది. ముఖ్యంగా రాజమౌళిని ఏదైనా సన్నివేశం ఇన్స్పైర్ చేస్తే కచ్చితంగా వాటిని రిక్రియేట్ చేస్తూ అందులో తనదైన స్టైల్ లో తీస్తూ ఉంటారు.


ప్రస్తుతం రాజమౌళి పేరు దేశంలోనే కాదు వివిధ దేశాలలో కూడా ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా మహేష్ బాబుతో తెరకెక్కించే సినిమా పైన అందరూ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఎక్కడ షూటింగ్ జరుపుకుంటుంది? ఎవరెవరు నటిస్తారు ? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అనే అంశాల పైన అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. అయితే ఇటీవలే ఆస్కార్ అవార్డు అందుకున్న వారందరికీ కూడా రాజమౌళి అభినందనలు తెలియజేయడం జరిగింది.. అయితే అందులోనే ఒక కిటుకుంది రాజమౌళి బెస్ట్ ఇంటర్నేషనల్ పిక్చర్ కేటగిరీలో వచ్చినటువంటి  బ్రెజిల్ సినిమా అయిన "అయామ్ స్టిల్ హియర్ "డైరెక్టర్ వాల్టర్ సాలెస్ రాజమౌళి ప్రత్యేక అభినందనలు చేయడం గమనార్హం.


వాస్తవానికి ఇప్పటివరకు బ్రెజిల్ దేశానికి ఒక్క ఆస్కార్ అవార్డు కూడా రాలేదట.అలాంటిది వాల్టర్ తెరకెక్కించిన అయామ్ స్టిల్ హియర్ అనే చిత్రానికి ఆస్కార్లో బెస్ట్ ఇంటర్నేషనల్ పిక్చర్ గా రావడంతో అక్కడి బ్రెజిల్ దేశస్తులు కూడా ఒక పండుగలాగా జరుపుకుంటున్నారట. అంతేకాకుండా ఆ చిత్రానికి సంబంధించిన కొన్ని అంశాలతో ఒక మ్యూజియంగా కూడా బ్రెజిల్ దేశస్తులు ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. rrr అవార్డు వచ్చిన చిత్రానికి గాను బ్రెజిల్ సినిమా డైరెక్టర్కు ఒక సంబంధం ఉన్నదట..


మొదటిసారి ఆస్కార్ అవార్డు అనుకున్న ఇండియాన్ డైరక్టర్ గా రాజమౌళి ఉండగా బ్రెజిల్ నుంచి వాల్టర్ అందుకున్న మొట్టమొదటి ఆస్కార్ అవార్డు ఇదేనట.RRR చిత్రం తీయడానికి ముఖ్య కారణం  వాల్టర్ సాలెస్ తీసిన" ద మోటర్ సైకిల్ డైరీస్" అనే చిత్రమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రాన్ని క్రిష్ తొలి చిత్రంగా గమ్యం తీసి మంచి విజయాలను అందుకున్నారు. ఇక డైరెక్టర్ రాజమౌళికి కూడా ద మోటార్ సైకిల్ డైరీస్  సినిమా చూసి అందులో ఉండే సన్నివేశాలు  నచ్చడంతో సినిమాని ప్రఖ్యాత పోరాట యోధుడిగా తెరకెక్కించే అంశాలను కూడా తీసి అమరవీరుల గాధతో ఇద్దరు మిత్రుల స్నేహంతో తీయాలని ఆలోచన కూడా కలిగిందట. అలా పుట్టిందే RRR. అందుకే డైరెక్టర్ వాల్టర్ కు ఆస్కార్ అవార్డు రాగానే రాజమౌళి ఆనందపడ్డారట.

మరింత సమాచారం తెలుసుకోండి: