
ఇప్పటికే ఈ సినిమాలో రామ్ చరణ్‌తో పాటు .. కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ .. మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో నటించిన పలువురు అగ్ర నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు . ఈ సినిమా పై రామ్ చరణ్ అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు . అయితే.. తాజా గా ఈరోజు జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భం గా ఆర్ సి 16 మేకర్స్ ఈ సినిమా నుంచి జాన్వీ పై ఒక సింపుల్ ఫోటో ను సోషల్ మీడియాలో షేర్ చేశారు . తనకి బర్త్డే విషెస్ చెబుతూ తన క్యారెక్టర్ టెర్రిఫిక్గా ఉండబోతుందంటూ ఆడియన్స్ కు రివీల్ చేశాడు .
అలాగే ప్రేక్షకులకు ఈమె రోల్‌ని చూపించడానికి ఎంతో వెయిట్ చేస్తున్నానంటూ కూడా బుచ్చిబాబు చెప్పుకొచ్చాడు . ఇక దీంతో ఈ సినిమా లో ఈమెకి సాలిడ్ రోల్ దక్కేలా ఉందని కూడా చెబుతున్నారు . ఇక ఈ సినిమాకి ఏ . ఆర్ . రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా .. వృద్ధి సినిమాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తుంది . మరి ఈ సినిమా తో రామ్ చరణ్ పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి అంచనాలు అందుకుంటారో చూడాలి .
Wishing you a very Happy Birthday #janhvikapoor Loved working with you and I can’t wait for everyone to see your terrific character on screen🔥 #RC16 pic.twitter.com/t0bbBtWaiO
— BuchiBabuSana (@BuchiBabuSana) March 6, 2025