ఇప్పుడు మన సౌత్ ఇండస్ట్రిలో ఎంతోమంది హీరోయిన్స్ .. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. వారిలో రష్మిక, త్రిష, నిత్యమీనన్, శ్రీ లీలా ఇలా ఎంతో మంది హీరోయిన్లు పాన్ ఇండియా రేంజ్‌లో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. అందం, అభిన‌యంతో పాటు.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అందుకున్నారు. అలా 2025 నుంచి అత్యధికంగా రెమినరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ ఎవరో ఇక్కడ చూద్దాం . ముందుగా నేషనల్ క్రష్ రష్మిక మందన.. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతుంది. ఆమె నటించిన యానిమల్, పుష్ప 2, చావా సినిమాలు వరుసగా భారీ విజయాలు అందుకున్నాయి. అలాగే పుష్ప 2 సినిమాకు ఈమె ఏకంగా రూ.10 కోట్లు , చావా సినిమాకు రూ.4 కోట్లు రెమ్య‌న‌రేషన్ అందుకుంది. ఇక ఇప్పుడూ సల్మాన్ ఖాన్‌తో రాబోయే సికిందర్ సినిమాకు గాను రష్మిక రూ.13 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది.
 

ఇప్పటికే ఇండియన్ చిత్ర పరిశ్రమంలో.. రెండు దశబ్దల సినీ జీవితంలో.. భారీ డిమాండ్ తో కొనసాగుతుంది స్టార్ బ్యూటీ త్రిష. ఈమె నటించే ఒక్కో సినిమాకు రూ.10 నుంచి రూ.12 కోట్ల వరకు పారితోషకం అందుకుంటుంది. ఇక చిరంజీవితో నటుతున్న విశ్వంభర సినిమా కోసం ఏకంగా త్రిష రూ.12 కోట్ల వరకు అందుకుంటుందట. ఇక లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార కూడా సౌత్ నుంచి బాలీవుడ్ వరకు భారీ స్థాయిలో అభిమానులను ద‌క్కించుకుంది. ఈమె బాలీవుడ్‌లో నటించిన జవాన్ సినిమాకు గాను రూ.10 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంది.  ఈమె పెళ్లి తర్వాత డాక్యుమెంటరీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌లో అమ్మడం ద్వారా.. రూ.25 కోట్ల వరకు ఈమె సంపాదించిందని అంటున్నారు.



మరో పాన్ ఇండియా బ్యూటీ సమంత కూడా ఈమె నటించే ఒక్కో సినిమాకు రూ.3 నుంచి 8 కోట్ల వరకు వారితోష్కం అందుకుంటుంది. బాలీవుడ్లో నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్‌కు గాను.. ఈమె క్యారెక్టర్ కు రూ.10 కోట్ల వరకు పారితోషకం అందుకుంది. కెరీర్‌లో ఇప్పటివరకు ఈమె తీసుకున్న అత్యధిక మొత్తం ఇదే. రీసెంట్గా వ‌రుస‌ విజయాలు అందుకుంటున్న సాయి పల్లవి కూడా పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ అందుకుంది. ఈమె కూడా ఒక్కో సినిమాకు రూ.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తుంది .  ప్రస్తుతం ఈమె బాలీవుడ్లో రామాయణం సినిమాకు రూ.20 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుందట. దీంతో మన సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుని హీరోయిన్గా సాయి పల్లవి రికార్డు క్రియేట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: