సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. మెగాస్టార్‌గా తిరుగులేని ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు చిరంజీవి. ఏడు పదుల వయసులోనూ.. ఇప్పటికీ ఇండస్ట్రీలో యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ రాణిస్తున్న మెగాస్టార్.. తన సినీ కెరీర్‌లో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. అయితే.. ప్రస్తుతం చిరు బింబిసార‌ ఫేమ్ డైరెక్టర్ వ‌శిష్ఠ డైరెక్షన్లో విశ్వంభర సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా పనులలో బిజీగా గడుపుతున్న చిరు.. ఈ మూవీ పనులు పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి డైరెక్షన్లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
 

ఈ విషయాన్ని ఆయన అఫీషియల్ గా వెల్లడించాడు. కామెడీ ఎంట్టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్క‌నుందని.. ఈ సినిమాలో నటించేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నానంటూ చిరు వివరించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా ఈ ఏడాది జూన్ నుంచి సెట్స్‌ పైకి రానుంది. కేవలం ఆరు నెలల్లో సినిమా షూట్ మొత్తాన్ని పూర్తిచేసి 2026 సంక్రాంతి బడిలో సినిమాను రిలీజ్ చేసేలా అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే కథను ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు అనీల్‌. కాగా వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా 1991 నాటి పిరియాడికల్ స్టోరీ అని.. అదే టైం పిరియ‌డ్‌తో రూపొందుతుందంటూ తెలుస్తుంది.

 

ఇక ఈ విషయం అఫీషియల్ ప్రకటన రాకున్నా.. ప్రస్తుతం ఈ న్యూస్ అయితే నెటింట‌ వైరల్‌గా మారుతుంది. ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో అనిల్ బిజీబిజీగా గ‌డుపుతున్నాడు. చిరు సైతం అనిల్ సినిమాకు అవసరమైన మేకవర్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే వీళ్ళ కాంబినేషన్లో సినిమాపై ఆడియన్స్ విపరీతమైన అంచనాలనుకున్నాయి. వాస్తవానికి చిరంజీవి లాంటి స్టార్ హీరోతో సినిమా తెరకెక్కించే అవకాశం యంగ్ హీరోలకు వచ్చిందంటే వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసుకోవడానికి మరింత కసిగా ప్రయత్నిస్తారు. ఇప్పుడు అనిల్ రావిపూడి సైతం ఇదే ప్లాన్లో ఉన్నాడట. దీంతో చిరంజీవికి భారీ సక్సెస్ అందడం ఖాయమని టాక్‌ నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: