
ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన సోనీలీవ్ లో మహారాణి సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ మూడు సీజన్ లు ఉంది. ఆ మూడు సీజన్లు ఇప్పుడు సోనీలీవ్ లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. 1990లో బీహార్ రాజకీయాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సిరీస్ ఆడవారు వంటింటికి మాత్రమే పరిమితం అవ్వకోడదని తెలియజేస్తుంది. అలాగే నటి సుస్మితా సేన్ నటించిన ఆర్య అనే వెబ్ సిరీస్ జియో హాట్ స్టార్ ఓటీటీలో ఉంది. ఈ వెబ్ సిరీస్ ప్రతి మహిళ మనసులో స్పూర్తిని నింపుతుంది. ఈ సిరీస్ ఓ సాధారణ గృహిణి పవర్ ఫుల్ డ్రగ్స్ నుంచి తన పిల్లలను ఎలా కాపాడుకుంటుందనేది చూపిస్తుంది.
అలాగే డిల్లీ క్రైమ్, స్యూప్ వెబ్ సిరీస్ లు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. డిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ లో నేరాలను పరిష్కరించే ఓ పవర్ ఫుల్ లేడి పోలీస్ ఆఫీసర్ గురించి ఉంటుంది. ఇది రెండు సీజన్లు ఉంది. స్యూప్ వెబ్ సిరీస్ ఓ మహిళా క్రైమ్ జర్నలిస్ట్ చుట్టూ తిరిగే ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. కోడ్ ఎం వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో ఉంది. ఈ సిరీస్ ఓ మహిళా ఆర్మీ ఆఫీసర్ గురించి ఉంటుంది. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 కూడా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ ఓ మహిళా తీవ్రవాది చుట్టూ తిరుగుతుంది.