
హీరో ప్రభాస్ కాలికి గాయం అయ్యిందని గత కొద్దిరోజులపాటు సినిమా షూటింగ్లకు దూరంగా ఉండబోతున్నారని ప్రచారం జరుగుతోందనే విషయం తమ వద్దకు వచ్చిందని ఈ విషయం పైన టీమ్ క్లారిటీ ఇస్తూ ప్రభాస్ కు ఎటువంటి గాయాలు కాలేదని ఎవరూ కూడా అసత్య ప్రచారాలని నమ్మవద్దు అంటూ తెలియజేశారు.. ముఖ్యంగా ప్రభాస్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి పడడంతో చాలా గాయం అయ్యిందని ఇటలీలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారంటూ పలు రకాల న్యూస్ ఛానల్ వార్తలను స్ప్రెడ్ చేస్తున్నాయని ఇందులో నిజం లేదంటూ క్లారిటీ ఇచ్చింది టీమ్.. ఈ విషయం తెలియడంతో అటు అభిమానులు కొంతమేరకు ఊపిరి పీల్చుకున్నారు.
మరి కొంతమంది మాత్రం మరి ప్రభాస్ ఎక్కడ ఎందుకు కనిపించడం లేదు అన్నట్లుగా పలు రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో వరుస పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి కల్కి 2, సలార్ 2, రాజా సాబ్, స్పిరిట్ , ఫౌజి వంటి చిత్రాలలో నటిస్తూ ఉన్నారు ప్రభాస్ ఈ సినిమాలన్నీ కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ప్రభాస్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారట.. సినిమాలపరంగా ఈ మధ్యకాలంలో మంచి కంటెంట్ ని ఎంచుకుంటున్న ప్రభాస్ అభిమానులకు మాత్రం ప్రభాస్ పెళ్లి విషయం పైన చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు..ఇప్పటివరకు తన పెళ్లి గురించి మాత్రం ఎక్కడా స్పందించలేదు. కానీ ఈ ఏడాది జరుగుతుందంటూ ఇప్పటికే ఎన్నో ఏడాదులు దాటేశారు ప్రభాస్.