
ఈమె ప్రస్తుతం దిల్ రూబా సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నాడు.
దిల్ రూబా మూవీకి విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా హోలీ పండుగ కానుకగా మార్చి 14న థియేటర్ లలో గ్రాండ్ గా రిలీజ్ అవ్వనుందని మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాను రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సరేగమ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి కన్నా నీ అనే లిరికల్ వీడియో కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ లిరికల్ సాంగ్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కూడా లభించింది.
అయితే ఇదిలా ఉండగా.. ఈ సినిమా టైలర్ రిలీజ్ ఈవెంట్ లో నటి రుక్సర్ థిల్లాన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సినిమా ఈవెంట్ లో ఈమె మాట్లాడుతూ.. 'దిల్ రూబా సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ పేరు అంజలి. ఈ పాత్ర నాకు చాలా స్పెషల్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ కి చాలా థాంక్స్. ఈ సినిమాలో నా నటన ఇంకా బాగా కనిపిస్తుంది. ఈ సినిమా మా టీమ్ అందరికీ చాలా స్పెషల్. అందరూ వచ్చి మార్చి 14న మా సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా కనెక్ట్ అవుతారు. చాలా ప్రేమతో చెప్తున్న నేను కంఫర్ట్ గా లేను ప్లీజ్ నా ఫోటోస్ క్లిక్ చేయకండి. నేను పేర్లు చెప్పాను కానీ గౌరవంతో చెప్తున్న దయచేసి నా ఫోటోస్ తీయకండి అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.