
అయితే డ్రాగన్ సినిమాలో నటించిన కయాడు లోహర్ ఇంతకుముందే అల్లూరి సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కానీ ఆ సినిమా మంచి టాక్ ని సొంత చేసుకోక.. ఈమెకి కూడా మంచి గుర్తింపు రాలేదు. ఇదిలా ఉండగా.. ఈ హీరోయిన్ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా నిలవాలని కోరుకుంటుంది. పాపులర్ అవ్వాలని తన మీద తానే మీమ్స్ క్రియేట్ చేసుకుంటుంది. అందులో తెలుగు సినిమాలో నెక్స్ట్ టాప్ హీరోయిన్ అంటూ కయాడు లోహర్ తన ఫోటోతో చేసుకున్న మీమ్ కూడా ఉన్నట్లు ప్రదీప్ స్పష్టం చేశారు. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయం రివీల్ అయిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ అందాల భామ తమిళనాడులో ఓ ఈవెంట్ కి హాజరైంది. ఆ ఈవెంట్ లో మీ క్రష్ ఎవరు అంటూ అడిగారు. దానికి నటి కయాడు లోహర్ మాట్లాడుతూ.. 'నాకు ఫేవరెట్ సెలబ్రెటీ క్రాష్ ఎవరంటే.. దళపతి విజయ్. నో డౌట్ ఇందులో.. ఖచ్ఛితంగా విజయ్' అంటూ చెప్పుకొచ్చింది. అలాగే విజయ్ ఫేమస్ సాంగ్ 'అపిడి పోడే పోడే' స్టేజ్ మీదే డ్యాన్స్ చేసింది. ఈ వీడియో చూసిన వారందరూ క్యూట్ గా ఉంది అంటూ తెగ పోస్టులు పెడుతున్నారు.