నేషనల్ క్రష్ గా రష్మిక మందన్నా పేరు తెచ్చుకోవడం తోపాటు వరుస వివాదాల్లో కూడా ఇరుక్కుంటుంది. ఎంత వివాదాల్లో ఇరుక్కుంటే అంత పాపులర్ అవుతుంది అన్నట్లుగా ఈ ముద్దుగుమ్మ ఎన్నిసార్లు వివాదాల్లో ఇరుక్కున్నా కూడా అంతకంతకు ఫేమస్ అవుతూనే వస్తుంది. అయితే ఈమె పుట్టి పెరిగింది కర్ణాటక రాష్ట్రం కాబట్టి ఎంతోమంది కన్నడిగులు రష్మిక మందన్నాపై ఫైర్ అవుతున్నారు.ఎందుకంటే కన్నడ ఇండస్ట్రీ నుండి సినిమాల్లోకి వచ్చిన రష్మిక స్టార్ హీరోయిన్ అయ్యాక కన్నడ ఇండస్ట్రీని మర్చిపోయిందని, కన్నడని పక్కన పెట్టింది అని ఎంతోమంది ఆమెపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఎమ్మెల్యే కూడా రష్మికపై తిట్ల దండకం తో అవమానించారు.

 కన్నడలో జరిగే ఏ ఒక్క సినిమా ఈవెంట్ కి కూడా రష్మిక మందన్నా రాదని ఎన్నిసార్లు పిలిచినా కూడా ఆమె మొండి చేయి చూపిస్తుందని,ఆ ఎమ్మెల్యే రష్మికపై ఫైర్ అయ్యారు. ఇక కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా సినిమా వాళ్ళ నట్లు, బోల్టులు టైట్ చేయాలి అంటూ రష్మికని ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడారు. అలా పుట్టిన గడ్డను మర్చిపోయి స్టార్డం రాగానే రష్మిక విర్రవీగి పోతుంది అంటూ కన్నడ ఇండస్ట్రీ మొత్తం రష్మికపై మండి పడడమే కాకుండా ఆమెను ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేయాలి అనే దిశగా కూడా ఆలోచన చేస్తున్నారు.ఇదంతా పక్కన పెడితే తాజాగా రష్మికకి మరో అవమానం జరిగింది. అదేంటంటే రష్మిక కి స్టేజ్ మీదే బోడిగుండు కొట్టేశారు. 

ఇక అసలు విషయం ఏమిటంటే.. రీసెంట్ గా ఒక మ్యాజిక్ షో కి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఆ మ్యాజిక్ షోలో మ్యాజిక్ చేసే వ్యక్తులు స్టేజ్ మీద రష్మిక మందన్నాకి సంబంధించిన ఫోటో పట్టుకొని కనిపించారు.అయితే మ్యాజిక్ చేసి వ్యక్తి కొన్ని సెకన్లలోనే రష్మిక మందన్నా జుట్టు తొలగించి గుండుతో చూపించారు. దీంతో ఈ వీడియో చూసిన చాలా మంది రష్మిక అభిమానులు ఈ వీడియో పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంత పెద్ద హీరోయిన్ కి ఇలా స్టేజి మదే అవమానం చేస్తారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రష్మిక కి చూస్తుండగానే గుండు కొట్టేశారు అంటూ ఈ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: