మారుతి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా చేస్తున్న తాజా మూవీ ది రాజా సాబ్.. ఈ సినిమా నుండి ప్రభాస్ పోస్టర్, గ్లింప్స్, పోస్టర్ ఇలా ప్రతి ఒక్కటి అభిమానులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు తీస్తూ పాన్ ఇండియా డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తున్న ప్రభాస్ చిన్న డైరెక్టర్ కి అవకాశం ఇవ్వడంతో చాలామంది అనుమానపడ్డారు. ఎందుకంటే భారీ ఎత్తున  సినిమాలు తీస్తున్న ప్రభాస్ ని ఇలాంటి చిన్న డైరెక్టర్ తో సినిమా తీస్తే అభిమానులు ఒప్పుకుంటారా..సినిమా ఎలా ఉంటుందా అని అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ప్రభాస్ కి సినిమా మీద ఫుల్ నమ్మకం ఉంటేనే ఈ సినిమా ఒప్పుకుంటారు అని ఇంకొంతమంది తమకు తామే సర్ది చెప్పుకున్నారు. ఈ విషయం పక్కన పెడితే ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్,రిద్ది కుమార్ వంటి హీరోయిన్లు చేస్తున్నారు. 

అయితే తాజాగా ఈ సినిమా డైరెక్టర్ పై ప్రభాస్ ఫైర్ అయినట్టు తెలుస్తోంది. అంతేకాదు సినిమా అవుట్ ఫుట్ ఏమీ బాగాలేదని, మళ్లీ సినిమాలోని 80% షూటింగ్ రీ షూట్ చేయాలని ప్రభాస్ డైరెక్టర్ ని తిట్టినట్టు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక విషయంలోకి వెళ్తే..పీపుల్స్ వీడియో బ్యానర్ పై తెరకెక్కుతున్న ది రాజా సాబ్ మూవీకి నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చారట.అయితే ఎంత డబ్బులు పెడితే ఏం లాభం అన్నట్లుగా డైరెక్టర్ సినిమాకి అంతగా గ్రాఫిక్స్ విజువల్స్ ఇవ్వలేదట.దాంతో ఈ సినిమా అవుట్ ఫుట్ చూసిన ప్రభాస్ డైరెక్టర్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేసి అన్ని కోట్లు పెట్టి ఇంత చెత్తగా సినిమా తీస్తారా.. ఈ సినిమా నా అభిమానులకు ఏమాత్రం నచ్చదు.మళ్ళీ ఈ సినిమాలోని 80%నీ రీ షూట్ చేయాల్సిందే అని అసహన వ్యక్తం చేశారట.

అయితే ఇప్పటికే ఈ సినిమాని ఏప్రిల్ 10న విడుదల చేయాలని చిత్ర యూనిట్ ఫిక్స్ చేశారు. ఇలాంటివేళ మళ్ళీ రీషూట్ అంటే సినిమా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు డైరెక్టర్ పై ప్రభాస్ చాలా గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలతో పాటు గ్రాఫిక్స్ కూడా చాలా బలంగా ఇవ్వాలని అలా అయితేనే సినిమాని చూస్తారు అని ప్రభాస్ డైరెక్టర్ కి క్లాస్ ఇచ్చారట.దీంతో వచ్చే నెల 10 కి రిలీజ్ చేద్దాం అనుకున్న సినిమా వాయిదా పడుతుంది కావచ్చని చిత్ర యూనిట్ అసహనంలో మునిగిపోయినట్టు సమాచారం. మరి ఈ సినిమా గురించి వినిపించే రూమర్లు నిజమేనా.. నిజంగానే ది రాజా సాబ్ మూవీ రీ షూట్ చేయబోతున్నారా..సినిమా వాయిదా పడుతుందా అనేది చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తే గాని తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: