ఏంటి ఆ డైరెక్టర్ వల్లే అక్కినేని అఖిల్ జీవితం నాశమైందా..చెప్పిన వినకుండా ఆ డైరెక్టర్ అఖిల్ సినీ కెరియర్ ని నాశనం చేశారా..ఇంతకీ అఖిల్ సినీ కెరీర్ ని నాశనం చేసిన ఆ డైరెక్టర్ ఎవరో ఇప్పుడు చూద్దాం. అక్కినేని అఖిల్ నటించిన సినిమాలన్నీ ఫ్లాపే..ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తప్ప మిగిలినవన్నీ అట్టర్ ప్లాఫ్.. భారీ అంచనాలతో పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఏజెంట్ మూవీ కూడా భారీ డిజాస్టర్ అయ్యి రెండు సంవత్సరాల తర్వాత ఓటీటిలోకి వచ్చింది. అయితే అలాంటి అఖిల్ సినీ కెరియర్ పై ఇంట్లో వాళ్లతో పాటు అక్కినేని ఫ్యాన్స్ కి కూడా నమ్మకం లేదు.అలాగే బయట ఈయనకు పెద్ద మార్కెట్ కూడా లేదు. ఇదంతా పక్కన పెడితే అఖిల్ సినీ కెరీర్ నాశనం అవ్వడానికి కారణం ఆయనే అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు రచయిత కోన వెంకట్.రీసెంట్గా కోన వెంకట్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సమయంలో అక్కినేని అఖిల్ సినిమాల గురించి ఓ ప్రశ్న ఎదురైంది.

 దాంతో కోన వెంకట్ సమాధానం ఇస్తూ.. అక్కినేని అఖిల్ నటించిన అఖిల్ సినిమా స్టోరీ విన్న సమయంలోనే నేను వద్దని చెప్పాను. ఎంత మొత్తుకున్నా కూడా వివి వినాయక్ వినలేదు. అంతే కాదు ఆయన చాలా గుడ్డి నమ్మకంతో ఈ సినిమా భారీ హిట్ అవుతుందని నమ్మారు. కానీ ఈ సినిమా స్టోరీ పై మాకు అంత నమ్మకం లేదు. నేను చెప్పినా వినకపోవడంతో ఆయన ఫ్రెండ్స్ తో కూడా ఈ విషయం చెప్పించాను. కానీ ఎవరు ఎన్ని చెప్పినా కూడా వివి వినాయక్ అస్సలు పట్టించుకోలేదు. ఒకసారి సినిమా చేస్తాను సినిమా చూశాక మీరు ఈ సమాధానాలు ఇవ్వండి అని మాట్లాడారు. అయితే నేను చెప్పేది ఏంటంటే..ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే దానిపై నమ్మకం ఉండాలి.కానీ డిజాస్టర్ సినిమా కూడా హిట్ అవుతుంది అంటే అది గుడ్డి నమ్మకమే అని చెప్పుకోవాలి.

అలా వివి వినాయక్ అఖిల్ మూవీ పై గుడ్డి నమ్మకం పెట్టుకున్నారు. చివరికి సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాఫ్ అయింది. అయితే ఈ విషయం చెబితే వినాయక్ పై నాకు కోపం ఉందని అనుకుంటారు. కానీ వినాయక్ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు. పర్సనల్గా ఆయనకు నాకు చాలా మంచి బాండింగ్ ఉంది.కానీ సినిమా స్టోరీ నచ్చకపోవడంతో ముందే చెప్పేసాను. ఇక వివి వినాయక్ ప్రస్తుతం ఓ స్క్రిప్ట్ వర్క్ రెడీ చేస్తున్నారు.మళ్ళీ ఆయన భారీ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతారు. ఆ నమ్మకం నాలో ఉంది అంటూ కోనవెంకట్ వివి వినాయక్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక అఖిల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మూవీకి వివి వినాయక్ దర్శకత్వం వహించారు.భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.అయితే ఈ సినిమా రిజల్ట్ పై తాజాగా కోన వెంకట్ ఈ విధంగా స్పందించి తప్పంతా వివి వినాయక్ దే అన్నట్లుగా మాట్లాడారు

మరింత సమాచారం తెలుసుకోండి: