నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా మూవీ ది ప్యారడైస్.. సినిమా టైటిలే చాలా ఆసక్తికరంగా వెరైటీగా పెట్టారు. అలాగే దీనికి సంబంధించిన టీజర్ కూడా నాని బర్త్డే రోజు రిలీజ్ చేశారు.ఇక ఈ టీజర్ చూసిన చాలా మంది షాక్ తో నోర్లు మూసుకున్నారు. దానికి కారణం నాని చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించారు. ఈ సినిమాలో నాని అసలు మన న్యాచురల్ స్టార్ నానినేనా అని అందరూ నోరేళ్లబెట్టేంతలా. దసరా సినిమాతోనే అనుకుంటే ది ప్యారడైస్ మూవీ అంతకంటే ఎక్కువగా ఉండేలా ఉంటుందని సినిమా టీజర్ చూసిన వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక ది ప్యారడైస్ మూవీలో అందర్నీ ఆకట్టుకున్నది నాని రెండు జడలు వేసుకోవడం. అసలు ఈ సినిమాలో నాని ఎందుకు 2 జడలు వేసుకుంటున్నారు ఏంటి అని చాలామందిలో ఒక ఆసక్తిగా అయితే ఉంది. 

అయితే ఈ రెండు జడల వెనుక ఓ డైరెక్టర్ రియల్ స్టోరీ ఉందట. అవును మీరు వినేది నిజమే.ఎందుకంటే స్వయంగా డైరెక్టర్ ఈ విషయాన్ని బయటపెట్టారు.ఇక నాని రెండు జడల వెనుక  దాగి ఉన్న రియల్ స్టోరీ  ఏ డైరెక్టర్ దో కాదు. శ్రీకాంత్ ఓదెల..అయితే శ్రీకాంత్ ఓదెల రియల్ లైఫ్ లో చిన్నతనంలో ఐదో తరగతి చదివే వరకు కూడా తన తల్లి ఎంతో ఇష్టంగా తనకు రెండు జడలు వేసేదని, ప్రతిరోజు రెండు జడలు అల్లి స్కూల్ కి పంపించేదని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ఓదెల బయటపెట్టారు. అయితే ఈ రెండు జడల వెనుక మరొక ఎమోషనల్ స్టోరీ ఉంది.

ఆ ఎమోషనల్ స్టోరీ సినిమాలోనే చెబుతాను ఇప్పుడు మాత్రం రివీల్ చేయలేను అంటూ శ్రీకాంత్ ఓదెల చెప్పుకొచ్చారు. ఇక చిన్నతనంలో చాలామంది అబ్బాయిలకు తమ తల్లులు జుట్టు పెంచి జడలు వేసిన అనుభవం చాలామందిలో ఉంది.అలా శ్రీకాంత్ ఓదెలకు కూడా తన తల్లి చిన్నతనంలో జడలు వేసి స్కూల్ కి పంపించేదని బయట పెట్టారు. అయితే నానికి జడలు వేయడం వెనుక శ్రీకాంత్ ఓదెల రియల్ లైఫ్ స్టోరీ కి మధ్య ఏదో సంబంధం ఉందని శ్రీకాంత్ ఓదెల మాటలు విన్న నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి ది ప్యారడైస్ మూవీ ఎలా ఉండబోతుంది.. నాని కెరీర్ కి ఈ సినిమా ప్లస్ అవుతుందా అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: