
అసలు విషయంలోకి వెళ్తే హైదరాబాద్కు చెందిన ఒక ప్రైవేటు ఉద్యోగి తన స్నేహితులతో కలసి ఎక్కువగా గోవాకి వెళుతూ ఉండేవారట.. గత ఏడాది అక్టోబర్లో క్యాసినో కు వెళ్ళగా అక్కడ శ్రీలంకకు చెందిన వివేక్, ఉదయ్ రాజ్ వంటి వారు పరిచయమయ్యారట. అయితే అక్కడ తాము కొత్తగా విడుదల అయ్యే తెలుగు చిత్రాలను ప్రమోషన్స్ వంటివి చేస్తూ ఉంటాం అంటూ తెలిపారట. అయితే అదే నెలలో ఉదయ్ రాజ్ గచ్చిబౌలిలో ఒక హోటల్లో దిగి ఆ బాధితుడిని కలిసి త్వరలో పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా డైరెక్టర్ సుజిత్ తో కలిసి ఉన్న ఫోటోలను చూపిస్తూ నమ్మించారట.
అయితే తాము అమరన్ చిత్రానికి ప్రమోషన్ చేసినందుకు 20 లక్షలు ఇస్తే వారం రోజుల లోపు లాభాలు వచ్చాయంటూ ఆ వ్యక్తిని నమ్మించారట.అలా రెండుసార్లు ఆ ఇద్దరు బ్యాంకు ఖాతాలో నుంచి అమరన్ చిత్రానికి సంబంధించిన లాభాలు వచ్చాయని చూపించారట. అలా 25 లక్షల రూపాయలు ఆ ప్రైవేటు ఉద్యోగి ఖాతాలో వేసేలా చేశారు. ఆ తర్వాత పుష్ప 2, గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్ పేరిట 76 లక్షలు.. మరొకసారి 58 లక్షలు తీసుకున్నారట. అయితే ఆ బాధితుడు తన ఆస్తితో పాటు తన భార్య నగలు అన్ని అప్పు చేసి సుమారుగా 1.34 కోట్ల రూపాయల వరకు చెల్లించారట.. అయితే ఆ తర్వాత వారికి ఫోన్ చేయక వారు స్విచాఫ్ లో ఉండడంతో తాను మోసపోయాను అని గ్రహించి సిపిఎస్సి లో ఫిర్యాదు చేయించారట.