
మహేష్ బాబు నటించిన సినిమాలు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. ఫ్లాప్ టాక్ దక్కించుకున్న మంచి కంటెంట్ ఉంటుంది అనే పేరు ఉంది. ఎంత సీరియస్ సిచువేషన్ ని అయినా సరే మహేష్ బాబు హ్యాండిల్ చేయడం చాలా చాలా సందర్భాలలో చూశాం. అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పుడు ఇదే విషయాన్ని బాగా ట్రెండ్ చేస్తున్నారు . ఇండస్ట్రీలో మహేష్ బాబు తర్వాత అలా ఫ్యామిలీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న స్టార్ హీరో ఎవరు అంటూ మాట్లాడుకుంటున్నారు.
అంతేకాదు అలా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో పేరుని బాగా వైరల్ చేస్తున్నారు . ఆయన మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ . మహేష్ బాబు నటన - స్టైల్ - డాన్స్ డెలివరీ ఎంత బాగుంటాయో అందరికీ తెలిసిందే . అదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా బాగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు . జూనియర్ ఎన్టీఆర్ ఎటువంటి రోల్స్ కైనా బాగా సెట్ అవుతాడని.. అది లవర్ బాయ్ గా..యాక్షన్ సీన్స్ కి.. మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమాలకి అన్ని విధాల పర్ఫెక్ట్ అని మాట్లాడుకుంటున్నారు . అంతేకాదు మహేష్ బాబు తర్వాత ఆయనతో పోటీపడి నటించే ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న సత్తా ఉన్న ఏకైక హీరో జూనియర్ ఎన్టీఆర్ ని అంటూ తెగ పొగిడేస్తున్నారు. ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా లో నటించి ఆ సినిమాను రిలీజ్ చేసే పనిలో ఉన్నారు . మరొక పక్క దేవర 2 ని కూడా సెట్స్ పైకి తీసుకొచ్చే పనిలో ఉన్నారు..!