ప్రముఖ సింగర్లలో ఒకరైన కల్పన గురించి పలు రకాల రూమర్స్ గత రెండు రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి.. కుటుంబ సభ్యుల గొడవలతో  కల్పన ఆత్మహత్య ప్రయత్నం చేసిందనే విధంగా పలు రకాల వార్తలు వినిపించాయి. ఈ విషయం పైన అటు కుటుంబ సభ్యులు తన కూతురు కూడా క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా ఈ రూమర్స్ ఆగకపోవడంతో తాజాగా సింగర్ కల్పన ఒక కీలకమైన ప్రకటన చేస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది.


తన ఆరోగ్యం పైన సూసైడ్ విషయాల పైన స్పందిస్తూ.. వీడియోను కూడా విడుదల చేసింది కల్పన.. ముఖ్యంగా తన స్ట్రెస్ వల్లే తాను స్లీపింగ్ టాబ్లెట్ వేసుకున్నానంటూ ప్రకటించింది. తనకు తన భర్తకు ఎలాంటి గొడవలు లేవని తాను ప్రాణాలతో ఉన్నానంటే అందుకు కారణం తన భర్త , కూతురు మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చింది సింగర్ కల్పన. అయితే గత రెండు మూడు రోజుల నుంచి తన మీద జరిగే ప్రచారాల ఎలాంటి వాస్తవం లేదంటూ కూడా తెలియజేసింది. సరైన సమయంలో ఆయన పోలీసులను అలర్ట్ చేశారు కాబట్టి తాను ప్రస్తుతం బ్రతికి ఉన్నాను అంటూ వీడియో ద్వారా తెలియజేసింది.


ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితమే సింగర్ కల్పన ఆత్మహత్య ఉదంతం బయటికి వచ్చింది. స్లీపింగ్ టాబ్లెట్లు ఎక్కువగా మింగి సూసైడ్ అటెంప్ట్ చేసిందని విధంగా వార్తలు వినిపించాయి. కానీ ఈమె ఎక్కువగా వేసుకోవడం వల్ల నిద్రలోకి వెళ్లిపోయిందని వైద్యులు కూడా తెలియజేశారు. ఎప్పటికప్పుడు వైద్యులు కూడా కల్పన ఆరోగ్యం గురించి అప్డేట్లను తెలియజేస్తూ ఉన్నారు. మొత్తానికి ఆరోగ్యంగానే కల్పన బయటపడి ఈ వీడియో ద్వారా తెలియజేయడంతో అభిమానులు కొంతమేరకు ఊపిరి పీల్చుకున్నారు. కోలుకున్న తర్వాత మొదటిసారి  సింగర్ కల్పన ఈ వీడియోతో వైరల్ గా మారుతున్నది. మరి తనపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టింది కల్పన.

మరింత సమాచారం తెలుసుకోండి: