నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం NKR 21 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా రోజులు అవుతుంది . ఇక ఈ మూవీ లోని యాక్షన్స్ సన్నివేశాలను అత్యం త భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు కొన్ని వార్తలు అప్పట్లో వచ్చాయి . ఈ మూవీ కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతు న్న మూవీ గా కూడా వార్తలు వచ్చాయి. దానితో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

అలాంటి సమయం లోనే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో అలనాటి స్టార్ నటి అయినటువంటి విజయశాంతి కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దానితో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఈ సినిమాకు టైటిల్ను ఫిక్స్ చేయకపోవడంతో NKR 21 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ షూటింగ్ను మేకర్స్ పూర్తి చేస్తూ వచ్చారు. ఇకపోతే ఈ మూవీ కి అర్జున్ సన్నాఫ్ వైజయంతి అనే టైటిల్ను అనుకుంటున్నట్లు , దానిని మరికొన్ని రోజుల్లో ప్రకటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అయింది.

ఇకపోతే తాజాగా NKR 21 మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ను మార్చి 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఈ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్లో S మరియు O అనే పదాలను మేకర్స్ హైలెట్ చేశారు. దీనితో ఈ మూవీ కి అర్జున్ సన్నాఫ్ వైజయంతి అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు దాదాపుగా అర్థం అవుతుంది. కానీ అధికారిక ప్రకటన మాత్రం ఈ నెల 8 వ తేదీన రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nkr