టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా ... బీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల అయ్యి అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ సక్సెస్ కావడంతో వెంకీ తన తదుపరి మూవీ ఏ దర్శకుడితో చేస్తాడా అనే ఆసక్తి తన అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకుల్లో కూడా నెలకొంది. ఇలాంటి తరుణంలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒకానొక సందర్భంలో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించి ఆఖరి సినిమాతో మాత్రం భారీ అపజయాన్ని అందుకున్న ఓ దర్శకుడితో వెంకీ తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన వారిలో సురేందర్ రెడ్డి ఒకరు. ఈయన ఎన్నో విజయాలను ఇప్పటి వరకు అందుకున్నాడు. ఆఖరుగా ఈ దర్శకుడు ఏజెంట్ అనే సినిమాకు దర్శకత్వం వహించి భారీ అపజయాన్ని అందుకున్నాడు.

ఇకపోతే సురేందర్ రెడ్డి ప్రస్తుతం వెంకీ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు , అందులో భాగంగా వెంకటేష్ ను తాజాగా కలిసి ఓ కథను కూడా వివరించినట్లు అది వెంకటేష్ కు కూడా నచ్చడంతో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయడానికి వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లో వెలువబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: