సంచలన దర్శకుడు పూరిజగన్నాధ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. గతంలో వరుస బ్లాక్ బస్టర్స్ అందించిన పూరీ ఇప్పుడు వరుస ప్లాప్స్ అందిస్తున్నాడు.. పూరీ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా డిఫరంట్ గా ఉంటుంది.. ఊహించని ఆటిట్యూడ్ తో మాస్ డైలాగ్స్ తో పూరీ హీరో పాత్రకు ఊహించని ఎలివేషన్ ఇస్తాడు.. గతంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోస్ పూరీ బ్లాక్ బస్టర్స్ అందించాడు.. కానీ విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన “ లైగర్ “సినిమా పూరీ కెరీర్ ని గట్టిగా కుదిపేసింది..ఆ సినిమా రిలీజ్ ముందు మేకర్స్ చేసిన ఓవర్ అనౌన్స్మెంట్ సినిమా అడ్రస్ లేకుండా పోయేలా చేసింది..

ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చిన పూరీ లైగర్ తో మరింత కిందకి పడ్డాడు.. పూరీ మళ్ళీ ఫామ్ లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. లైగర్ దెబ్బ కోలుకొని ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కిస్తే ఆ సినిమా కూడా ఇప్పుడు పూరీని ప్లాప్స్ నుండి బయటపడేయలేకపోయింది.. గతంలో పూరీ సినిమాల్లో వున్న గ్రేస్ ఇప్పుడు కనిపించకపోవడంతో పూరీ సినిమాలు డిజాస్టర్ గా మిగులుతున్నాయి.ఇదిలా ఉంటే పూరీ ఇప్పుడు అక్కినేని వారసుడు అఖిల్ తో సినిమా చేయనున్నట్లు న్యూస్ వస్తుంది.. అఖిల్ కెరీర్ కూడా ఆల్మోస్ట్ డేంజర్ సిట్యుయేషన్ లో వుంది..

భారీ బడ్జెట్ తో చేసిన ఏజెంట్ ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.. ఈ సినిమా తరువాత అఖిల్ చాలా గ్యాప్ తీసుకున్నారు..ఇప్పటికీ అఖిల్ ఎలాంటి సినిమాలు చేయాలో తేల్చుకోలేకపోతున్నాడు.. దీనితో నాగార్జున పూరీకి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది.. అఖిల్ కి స్ట్రాంగ్ మాస్ హిట్ ఇవ్వాల్సిందిగా నాగార్జున కోరారని సమాచారం.. అఖిల్ కూడా పూరీ డైరెక్షన్ లో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు..దీనితో వీరిద్దరి కాంబో వర్కౌట్ అవుతుందా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: