టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి నితిన్ ప్రస్తుతం రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... ఛలో , భీష్మ సినిమాలకు దర్శకత్వం వహించి రెండు మూవీలతో కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే నితిన్ , వెంకీ కాంబోలో భీష్మ అనే మూవీ రూపొంది అద్భుతమైన విజయాన్ని సాధించి ఉండడంతో విరీ కాంబోలో రూపొందుతున్న రెండవ మూవీ కావడంతో రాబిన్ హుడ్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇకపోతే ఈ సినిమాను మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. ఈ మూవీ.లో కేతిక శర్మ స్పెషల్ సాంగ్లో నటించింది అనే విషయం మనకు తెలిసిందే. ఈ స్పెషల్ సాంగ్ లో ఈ బ్యూటీ తన అందాలతో , డ్యాన్స్ తో ఆకట్టుకోవడం ఖాయం అని వార్తలు చాలా రోజులుగా వస్తున్నాయి. దానితో ఎప్పుడెప్పుడు ఈ సాంగ్ విడుదల అవుతుందా అని ఎంతో మంది యువత ఎదురు చూస్తూ వస్తుంది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో కేతిక శర్మ చేసినటువంటి స్పెషల్ సాంగ్ అయిన ఆది దా సర్ప్రిస్ అంటూ సాగే సాంగ్ ను మార్చి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు.

మేకర్స్ తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్లో కూడా కేతిక అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని అందాలను ఆరబోసే విధంగా స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ పోస్టర్ కూడా వైరల్ అవుతుంది. మరి ఈ సినిమాలోని అది దా సర్ప్రైజ్ అంటూ సాగే స్పెషల్ సాంగ్లో కేతిక తన అందాలతో ఏ స్థాయిలో యువతను ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: