
అంతేకాదు ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ షేడ్స్ లో నటించబోతున్నారట . ఇప్పుడు అల్లు అర్జున్ - అట్లి కాంబోలో తెరకెక్కే సినిమా గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇదే మూమెంట్ లో ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా బయటపడింది . నిజానికి అట్లీ ఇప్పుడు అల్లు అర్జున్ తో తెరకెక్కించే సినిమాని ముందుగా బిగ్ బడా తెలుగు హీరోతో తెరకెక్కించాలి అని ఆశ పడ్డారట. ఆ హీరోకి కథ చెప్పగ రిజెక్ట్ చేసారట . ఆ హీరో మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ .
ఎస్ ప్రసెంట్ ఇదే న్యూస్ ట్రెండ్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ తో అట్లీ తెరకెక్కించాలి అనుకున్న సినిమాని ఇప్పుడు ఆయన ఇలా అల్లు అర్జున్ తో తెరకెక్కిస్తున్నాడు అని మాట్లాడుకుంటున్నారు . అంతేకాదు గతంలో అల్లు అర్జున్ నటించాల్సిన కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించాడు. ఈ కధను ముందుగా కొరటాల జూనియర్ ఎన్టీఆర్కి కాకుండా అల్లు అర్జున్ కి వివరించారట. వాళ్ళ మధ్య వచ్చిన ఇష్యుతో ఈ సినిమా ఆగిపోయింది . ఆ తర్వాత అదే సినిమాను ఎన్టీఆర్ తో తెరకెక్కించాడు కొరటాల శివ అని టాక్ కూడా బలంగా వినిపించింది . ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాతో అల్లు అర్జున్ రాబోతున్నాడు అని తెలిసి జనాలు ఫుల్ సర్ప్రైజ్ అయిపోతున్నారు..!