కొన్ని దశాబ్ధాల క్రితం కెఆర్ విజయ అమ్మవారి పాత్రాలకు చిరునామాగా ఉండేది. ఆమె నటించిన సినిమాలలో ఆమె అమ్మవారుగా కనిపించినప్పుడు ప్రేక్షకులు నిజంగానే తమ ఎదుట అమ్మవారు ప్రత్యక్షం అయిందని భావించి ధియేటర్లలో హారతులు ఇచ్చిన సందర్భాలు అప్పట్లో చాల ఉండేవి. అయితే ఇప్పుడు అలాంటి దేవతా మూర్తుల పాత్రలలో నటించి మెప్పించగల హీరోయిన్స్ ఎవరు లేరు.



నయనతార ముఖ్యపాత్రలలో నటిస్తున్న ‘అమ్మన్ 2’ {అమ్మోరు తల్లి} మూవీ ప్రారంభోత్సవం చెన్నైలో అత్యంత ఘనంగా జరిగింది. సాధారణంగా నయనతార తాను నటించే సినిమాల ప్రారంభోత్సవానికి అదేవిధంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఆమె రాదు. సినిమా షూటింగ్ మొదలైనప్పుడు తన కండిషన్స్ అన్నీ నయనతార తన నిర్మాతలకు చాలస్పష్టంగా చెపుతుంది అని అంటారు.



నయనతారకు దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న క్రేజ్ రీత్యా నిర్మాతలు  ఆమెకు అత్యంత భారీ పారితోషికం ఆఫర్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్ లో ఆమెకు కొనసాగుతున్న రీత్యా ఆమె నటిస్తున్న ‘అమ్మన్ 2’ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తీస్తున్నారు. ఈ మూవీ ప్రారంభోత్సవానికి కీలక పాత్రలో నటిస్తున్న నయనతార తన పాత పద్ధతులను పక్కకు పెట్టి ఈమూవీ ప్రారంభోత్సవానికి హాజరు కావడంతో ఈకార్యక్రమానికి దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఒక భారీ గుడి సెట్ వేయడమే కాకుండా అత్యంత ఖరీదైన ఇన్విటేషన్స్ ఇండస్ట్రీలోని అందరికీ పంపడంతో ఈన్యూస్ దక్షిణాది ఫిలిమ్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.



ఈప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇండస్ట్రీలోని ప్రముఖులతో పాటు మీనా రెజీనా తదితరులు గెస్టులుగా రావడంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నయనతార అమ్మోరు తల్లిగా నటించిన ఈమూవీ  మొదటి భాగం హాట్ స్టార్ ద్వారా డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈమూవీ ఓటీటీ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో పాటు మంచి రివ్యూలు కూడ రావడంతో ఈమూవీ పార్ట్ 2ను ఇప్పుడు అత్యంత భారీ స్థాయిలో తీస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: