విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి బీమ్స్ సంగీతం అందించాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.

దానితో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి భారీ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ఈ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా కూడా నిలిచింది. ఈ సినిమా విజయంలో బీమ్స్ అందించిన సంగీతం కూడా అత్యంత కీలక పాత్రను పోషించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందే ఈ సినిమా నుండి గోదారి గట్టు అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లోని ఈ లిరికల్ వీడియో సాంగ్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా విడుదల తర్వాత కూడా ఈ మూవీ లోని గోదారి గట్టు లిరికల్ వీడియోకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని గోదారి గట్టు సాంగ్ యూట్యూబ్ లో అదిరిపోయే రేర్ మార్క్ వ్యూస్ ను అందుకుంది.

గోదారి గట్టు సాంగ్ తాజాగా యూట్యూబ్లో 200 ప్లస్ మిలియన్ వ్యూస్ ను అందుకుంది. ఇలా ఈ సాంగ్ లిరికల్ వీడియోకు ఈ సినిమా విడుదల తర్వాత కూడా అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది. ఇకపోతే ఈ మూవీ లోని వెంకటేష్ , ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి నటనలకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: