కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమను ఒక ఊపు ఊపిన నటీమణులలో ముమైత్ ఖాన్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ కొన్ని సంవత్సరాల క్రితం ఎంతో మంది స్టార్ హీరోలు నటించిన సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లలో నటించి తన అందాలతో , డాన్స్ తో కుర్రకారును ఇక ఊపు ఊపింది. ఈమె స్పెషల్ సాంగ్ చేసిన సినిమాలలో కొన్ని మూవీలు అద్భుతమైన విజయాలను కూడా అందుకున్నాయి. ఈమె ప్రభాస్ హీరో గా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చత్రపతి సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.

ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పోకిరి సినిమాలో ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ చేసింది. ఈ మూవీ లోని స్పెషల్ సాంగ్ బ్లాక్ బాస్టర్ అయ్యింది. అలాగే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కూడా అయింది. ఇలా ఈమె నటించిన ఎన్నో సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకోవడంతో ఈమె కొన్ని సంవత్సరాల క్రితం అద్భుతమైన జోష్ లో తెలుగు సినీ పరిశ్రమలో కెరీర్ ను కొనసాగించింది. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ముమైత్ ఖాన్ కి పెద్దగా అవకాశాలు రావడం లేదు.

ఇకపోతే ముమైత్ ఖాన్ మాత్రమే కాకుండా తన చెల్లెలు కూడా సినిమా ఇండస్ట్రీ లోనే కెరియర్ను కొనసాగించింది. ఇంతకు ఆమె ఎవరు ..? సినిమా ఇండస్ట్రీలో ఆమె ఏం చేసిందో తెలుసుకుందాం. ముమైత్ ఖాన్ చెల్లెలి పేరు జాబీనా ఖాన్. ఈమె కొన్ని సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేస్తుంది. ఈ బ్యూటీ గొడవ , జగడం సినిమాల్లో సైడ్ హీరోయిన్గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: