
ఇక తర్వాత 2021 కి జీవిత, రాజశేఖర్ చిన్న కుమార్తె శివాని అద్భుతం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి పర్వాలేదు అనిపించుకున్నది శివాని. అయితే శివాని కెరియర్లో ఒక బ్లాక్ బాస్టర్ సినిమాని మిస్ చేసుకున్నదట. డైరెక్టర్ బుచ్చిబాబు, వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి కాంబినేషన్లో వచ్చిన ఉప్పెన సినిమా గురించి చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే వీరందరూ వంద కోట్ల క్లబ్ లోకి చేరారు. అయితే ఈ సినిమాకి ఫస్ట్ హీరోయిన్ గా శివాని రాజశేఖర్ ని ఎంపిక చేశారట.
కానీ ఈ చిత్రంలో కొన్ని ఇంటిమేట్ సీన్స్, హీరోలతో లిప్ లాక్ సన్నివేశాలు ఉండడంతో వాటికి శివాని నో చెప్పిందట.. ఇదే అవకాశాన్ని వదులుకోవడంతో కృతి శెట్టికి బాగా కలిసి వచ్చింది. శివాని మాత్రం ఒక బ్లాక్ బస్టర్ చిత్రాన్ని చేజేతులారా వదులుకుందని విషయాన్ని అభిమానులు తెలియజేస్తున్నారు. కానీ ఇప్పటికీ కెరియర్ని సక్సెస్ బాటలో పయనించేందుకు చాలా తిప్పలు పడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే మరి కొంతమంది మాత్రం హీరోయిన్స్ తమ లిమిట్స్ ని దాటకుండా కెరీర్ ని ముందుకు తీసుకువెళ్లడం కూడా మంచిదే అంటూ మరికొంతమంది నేటిజన్స్ తెలుపుతున్నారు. మరి రాబోయే రోజుల్లోనైనా ఎలాంటి కథలతో శివాని అభిమానులను మెప్పిస్తుందో చూడాలి మరి. వైష్ణవ్ తేజ్ కెరియర్ కూడా పెద్దగా ముందుకు సాగడం లేదు.