అక్కినేని హీరో అఖిల్ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అక్కినేని నాగార్జున వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. తాను నటించిన సినిమాలు కనీసం యావరేజ్ టాక్ కూడా అందుకోలేకపోవడం నిజంగా బాధాకరం. ఇప్పటివరకు అఖిల్ ఖాతాలో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా పడలేదు. తన సినిమాలను ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేకపోతున్నారు. కొద్ది రోజుల క్రితం ఏజెంట్ సినిమాతో అఖిల్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.


సినిమా 2023 ఏప్రిల్, 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రభావంతో అక్కినేని అఖిల్ కాస్త డీల పడిపోయాడు. ఈ సినిమా అనంతరం అఖిల్ ఇప్పటివరకు ఎలాంటి సినిమాలోనూ నటించలేదు. తాను నటించే తదుపరి సినిమా విషయంలో అఖిల్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట.


ఆ కారణంగానే ఇప్పటివరకు అఖిల్ సినిమాలు చేయడం లేదు. అయితే అఖిల్ ను సక్సెస్ దారిలోకి తీసుకురావడానికి తన తల్లి అమల స్పెషల్ గా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఎలాగైనా అఖిల్ నటించిన సినిమాలు హిట్ అవ్వడానికి అమల ప్రయత్నం చేస్తుందట. ఈ సందర్భంగా అఖిల ఓ స్టార్ డైరెక్టర్ ను సంప్రదించారట. అతను మరెవరో కాదు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ తో కలిసి అఖిల్ కు మెంటార్ గా ఉండమని అమల కోరుతున్నారట.


ఇకపై అఖిల్ తీయబోయే సినిమాలు, సినిమాల కథ విషయాలు, ఇతర విషయాలలో ప్రశాంత్ నీల్ కేర్ ఎక్కువగా ఉంటుందని సమాచారం అందుతోంది. అమల రిక్వెస్ట్ చేయడంతో ప్రశాంత్ నీల్ కూడా ఓకే చెప్పారట. ఇకనుంచి అఖిల్ సినిమాలకు సంబంధించిన విషయాలను ప్రశాంత్ నీల్ దగ్గర ఉండి చూసుకోబోతున్నారట. ఈ విషయం తెలిసి అక్కినేని అభిమానులు సంతోషపడుతున్నారు. అఖిల్ తీయబోయే సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటాయని ఆశ పడుతున్నారు. మరి ఈ విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: