టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి రష్మిక మందన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ ఇప్పటి వరకు ఎన్నో తెలుగు సినిమాలలో నటించి అందులో చాలా మూవీ లతో మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈ బ్యూటీ కొంత కాలం క్రితం పార్ట్ 1 అనే పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కి కొనసాగింపుగా రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ కూడా పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి సూపర్ సక్సెస్ కావడంతో ఈమె క్రేజ్ ఇండియా వ్యాప్తంగా మరింతగా పెరిగి పోయింది.

ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు తో పాటు అనేక ఇతర భాష సినిమాలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు తో పాటు ఎక్కువ శాతం హిందీ సినిమాల్లో నటిస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈమె ఛావా అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.  ప్రస్తుతం ఈమె సికిందర్ అనే మరో హిందీ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మకు అద్భుతమైన క్రేజ్ ఉండడంతో ఈమెకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే పుష్ప పార్ట్ 2 మూవీ కి గాను ఈ బ్యూటీ కి 10 కోట్ల వరకు పారితోషకం ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే చావా మూవీ కి గాను 4 కోట్ల పారితోషకం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక సికిందర్ మూవీ కి గాను ఏకంగా 13 కోట్ల పారితోషకం ఈ ముద్దు గుమ్మ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూడు మూవీలకు గాను ఈ బ్యూటీ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: