ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న దర్శకులలో రాజమౌళి , సుకుమార్ , ప్రశాంత్ నీల్ ముందు వరుసలో ఉంటారు. బాహుబలి సిరీస్ మూవీ లతో రాజమౌళి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆర్ ఆర్ ఆర్ మూవీ కి దర్శకత్వం వహించి ఆ మూవీ ని కూడా పాన్ ఇండియా మూవీ గా విడుదల చేసి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ తో రాజమౌళి క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది. ఇక ప్రస్తుతం రాజమౌళి , మహేష్ బాబు హీరో గా ఓ మూవీ ని రూపొందిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే సుకుమార్ ఇప్పటికే పుష్ప పార్ట్ 1 , పుష్ప పార్ట్ 2 మూవీ లను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసి రెండు మూవీ లతో కూడా బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే కే జి ఎఫ్ సిరీస్ మూవీలతో ప్రశాంత్ నీల్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సలార్ పార్ట్ 1 అనే మూవీ ని రూపొందించి దానితో కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం ఈ దర్శకుడు జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమాను రూపొందిస్తున్నాడు.

ఈ ముగ్గురికి కూడా ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ క్రేజ్ ఉంది. ఇక ఈ ముగ్గురు స్టార్ దర్శకులకు ఒక హీరో అంటే చాలా ఇష్టమట. ఆ విషయాన్ని వారే స్వయంగా చెప్పుకొచ్చారు. ఇంతకు ఆ నటుడు ఎవరో తెలుసా ..? ఆయన ఎవరో కాదు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి అంటే తమకు ఎంతో అభిమానం అని ఈ ముగ్గురు దర్శకులు పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: