మాస్ మహారాజా రవితేజ కొంత కాలం క్రితం మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా నటించగా ... హరీష్ శంకర్మూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే ఈ సినిమాతోనే భాగ్య శ్రీ తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ మూవీ లో ఈ బ్యూటీ తన అందాలతో , నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమె ఒక మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది.

సినిమా తర్వాత భాగ్యశ్రీ కి వరుస పెట్టి టాలీవుడ్ క్రేజీ సినిమాల్లో అవకాశాలు కూడా దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రవితేజ "మాస్ జాతర" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది ఈ మూవీ యూనిట్ ఈ సినిమా షూటింగ్ స్పీడ్ ను మరింత వేగ వంతం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఓ అప్డేట్ బయటకు వచ్చింది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ రైల్వే స్టేషన్ సెట్ లో నైట్ ఫైట్ సన్నివేశాన్ని షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ కి వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నట్లు తెలుస్తోంది. వరుస  అపాజయలతో డీలా పడిపోయిన రవితేజ ఈ సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: