సినిమా ఇండస్ట్రీ లో ఓ మూవీ ని మొదలు పెట్టిన తర్వాత అది కంప్లీట్ అయ్యాక దానిని చూసుకున్నాక అవుట్ ఫుట్ మేకర్స్ కు నచ్చనట్లయితే మళ్లీ రీ షూట్ చేసి సినిమాను విడుదల చేసేవారు అనేక మంది ఉన్నారు. ఓ సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక అవుట్ ఫుట్ నచ్చకపోవడంతో రీ షుట్ చేశారు అనే వార్త కనుక బయటకు వచ్చినట్లయితే ఆ మూవీ పై నెగటివ్ ఇంపాక్ట్ పడే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. దానితో మేకర్స్ ఒక వేళ రీ షూట్ చేయాల్సి వచ్చిన కూడా దానిని ఎవరికీ తెలియకుండా సైలెంట్ గా చేస్తూ ఉంటారు.

దానికి ప్రధాన కారణం అందుకు సంబంధించిన వార్త కనుక బయటకు వచ్చినట్లయితే సినిమా పై నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది అని మేకర్స్ అనుకోవడమే. ఇకపోతే తాజాగా టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం రీ షూట్ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. తాజాగా కిరణ్ అబ్బవరం కు ఇంటర్వ్యూలో భాగంగా సినిమాకు రీ షూట్స్ అవసరం అయితే చేయడం మంచిదేనా ... లేదా అనే ప్రశ్న ఎదురయింది. దానికి కిరణ్ సమాధానం ఇస్తూ ... ఏ సినిమాకు అయినా ఫైనల్ అవుట్ ఫుట్ అనేది చాలా ముఖ్యం. సినిమా మొత్తం పూర్తి అయ్యాక ఆ అవుట్ పుట్ బాగా లేకపోతే రీ షూట్ చేయడంలో పెద్ద తప్పేమీ లేదు. ఓ సినిమాకు పెట్టాల్సిన డబ్బు మొత్తం ఖర్చు పెట్టి రీ షూట్స్ కోసం ఆలోచించి వెనకడుగు వేస్తే సినిమా మొత్తానికే పోయే అవకాశం ఉంటుంది.

అందుకే రీ షూట్స్ చేసిన పెద్ద తప్పేమీ లేదు. ఒక వేళ రీ షూట్ చేస్తున్నారు అనే టాక్ బయటకు వచ్చిన , ఆ మూవీ పై నెగిటివ్ ఇంపాక్ట్ పడిన అది కేవలం మొదటి రోజు మార్నింగ్ షో , మ్యాట్నీ వరకే ఉంటుంది. సినిమా కనక బాగున్నట్లయితే ఆ తర్వాత పికప్ అందుకుంటుంది. అందుకే ఒక వేళ సినిమాకి రీ షూట్ అవసరం అయితే కచ్చితంగా రీ షూట్ చేయాలి అని కిరణ్ అబ్బవరం తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: