
దిల్ రాజు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీరిలీజ్ ఈవెంట్ లో ఈ లీక్ ఇచ్చాడు .. అయితే ముందుగా ఆలోచించి చెప్పాడా లేక అనుకోకుండా బయట పెట్టారా అనే సందేహం ఉన్నప్పటికీ టైటిల్ ప్రకటించిన వెంటనే విజయ్ అభిమానుల ఆనందంలో మునిగిపోయారు .. రాయలసీమ బ్లాక్ డ్రాప్టర్ లో వస్తున్న ఈ సినిమాకు రౌడీ జనార్ధన్ అనే టైటిల్ తో పక్క మాస్ ఎంటర్టైనర్ గా ఉంటుందని చెప్పవచ్చు .. ఇక అభిమానులు కూడా ఈ టైటిల్ విజయ్ దేవరకొండ స్టైల్ కి పర్ఫెక్ట్ గా ఉంటుందని అంటున్నారు .. అలాగే విజయ్ దేవరకొండకు రౌడీ హీరో అని ట్యాగ్ ఎప్పటి నుంచో ఉంది.
డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసినట్టు తెలుస్తుంది .. ఇక మే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ కు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ .. మిగతా నటీనటులు వివరాలు త్వరలోనే బయటకు రన్నున్నాయి .. ఇక ఈ సినిమా టైటిల్ లీక్ తర్వాత విజయ్ దేవరకొండ అభిమానుల ఆనందం ఊహించిన రేంజ్ లో ఉంది .. కింగ్డమ్ టీజర్ చూసి ఇది హిట్ అని ఫిక్స్ అయిన అభిమానులు ఇప్పుడు రౌడీ జనార్దన్ టైటిల్ తో మరింత ఎగ్జిట్ అవుతున్నారు.